Budget 2024 : ఇంటర్నెట్ ను ముంచెత్తుతున్న ఇన్ కంటాక్స్ మీమ్స్.. మీరూ ఇలాగే ఫీలవుతున్నారా?
సీతారామన్ ఈ రోజు వరుసగా ఆరో బడ్జెట్‌ను సమర్పించారు. ఊహించినట్టుగానే ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రకటించారు.
గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సమర్పణ తరువాత ఆదాయపు పన్నులో వెసులుబాటుకోసం చూస్తున్న వారికి ఎలాంటి ఊరట లభించలేదు. దీంతో నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2024 ప్రసంగం ముగించిన తర్వాత ఆదాయపు పన్ను ఆన్‌లైన్‌లో ట్రెండ్ గా మారింది. దీనిమీద మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత యేటా ఆదాయపు పన్ను మీద అనేక రకాల మీమ్స్ వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ రోజు కూడా ట్రెండ్ అవుతోంది. #IncomeTax ట్రెండ్‌ని ఇంటర్నెట్‌లోని విపరీతంగా హల్ చల్ అవుతోంది.
సీతారామన్ ఈ రోజు వరుసగా ఆరో బడ్జెట్‌ను సమర్పించారు. ఊహించినట్టుగానే ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రకటించారు.
"దిగుమతి సుంకాలతో సహా ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు ఒకే పన్ను రేట్లను కొనసాగించాలని ప్రతిపాదిస్తున్నాను" అని సీతారామన్ తన బడ్జెట్ 2024 ప్రసంగంలో చెప్పారు.
సీతారామన్ ఆదాయపు పన్ను ప్రకటన తర్వాత ప్రజల సెంటిమెంట్ మీమ్స్ రూపంలో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఆదాయపు పన్ను ప్రకటన తర్వాత 'జెతలాల్' మీమ్స్ X ని ముంచెత్తాయి. జెతలాల్ అంటే 'తారక్ మెహతా కా ఊల్టా చష్మా' కామెడీ షోలోని ఓ క్యారెక్టర్. దీనిని దిలీప్ జోషి జెతలాల్‌గా నటించారు.
నిర్మలా సీతారామన్, గత బడ్జెట్ 2023లో, మధ్యతరగతి కోసం వ్యక్తిగత ఆదాయపు పన్నులో అనేక మార్పులను ప్రకటించారు. కొత్త పన్ను విధానం డిఫాల్ట్ విధానంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పన్ను చెల్లింపుదారులు పాత విధానాన్ని కూడా ఎంచుకోవచ్చు.
ఆ మీమ్స్ ఇక్కడ చూడండి..