లగ్జరీ కార్ల కంపెనీలు మెర్సిడెస్ బెంజ్, ఆడి, లంబోర్ఘిని రాబోయే బడ్జెట్‌ 2021-22లో వాహనాలపై పన్ను తగ్గించాలని ప్రభుత్వన్ని  కోరింది. అధిక పన్ను విధించడం వల్ల ప్రీమియం కార్ల మార్కెట్ పెరగడం లేదని ఈ కంపెనీలు చెబుతున్నాయి.

కరోనా వైరస్ మహమ్మారి వల్ల లగ్జరీ కార్ల విభాగం కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లగ్జరీ కార్లపై పన్నులు పెరిగితే ఇది డిమాండ్‌ను ప్రభావితం చేస్తుందని, గత ఏడాదిలో ఎదురైన అడ్డంకులను ఈ రంగం అధిగమించలేదని ఈ కంపెనీల సీనియర్ అధికారులు తెలిపారు. 

మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ, "ఈ రంగం యొక్క డిమాండ్ను ప్రభావితం చేసే ఏదైనా, దానిని మేము నివారించాలి, ఎందుకంటే చివరికి అది సమస్యలను కలిగిస్తుంది."  అని అన్నారు.

రాబోయే బడ్జెట్‌లో పన్నులపై ప్రభుత్వం నుంచి మీ కంపెనీ ఏమి ఆశిస్తోందని అనే ప్రశ్నకు  సమాధానంగా " ఈ రంగం పై పన్ను రేటు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది. దిగుమతి సుంకాల నుండి వస్తువుల మరియు సేవల పన్ను (జిఎస్‌టి) వరకు లగ్జరీ కార్లపై సెస్ 22 శాతం వరకు ఉంటుంది. ఈ రంగం  వృద్ధికి తోడ్పడటం, పన్నులను తగ్గించడం మా లక్ష్యం అని నేను నమ్ముతున్నాను" అని అన్నారు.

also read బడ్జెట్ 2021-22 నుండి రియల్ ఎస్టేట్ రంగం అంచనాలు ఏమిటో తెలుసుకోండి..

కోవిడ్ -19 వల్ల కలిగిన అడ్డంకుల నుంచి లగ్జరీ కార్ల మార్కెట్ ఇంకా కోలుకుంటుందని ఆడి ఇండియా అధినేత బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు. ఈ రంగానికి పెద్ద పెద్ద సవాళ్లు ఉన్నాయి. అందులో లగ్జరీ కార్లపై అధిక పన్ను అనేది ఖచ్చితంగా ఒక సవాలు.

ఈ కారణంగా, దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ మొత్తం వాహన మార్కెట్లో ఒక శాతం మాత్రమే ఉంది. గత సంవత్సరంలో అంటే 2020లో ఇది బహుశా 0.7 నుండి 0.8 శాతానికి పడిపోయింది.

 లంబోర్ఘిని ఇండియా అధినేత శంబర్ అగర్వాల్ మాట్లాడుతూ,  ఈ విభాగం 2020లో చాలా నష్టపోయింది. ఈ రంగం 2021లో కనీసం 2019 స్థాయికి చేరుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము ప్రస్తుతం వృద్ధిని ఆశించడం లేదు.

కానీ గత సంవత్సరం అంటే 2019 స్థాయిని సాధించాలని మేము కోరుకుంటున్నాము. లగ్జరీ కార్లపై పన్ను పెరుగుదల ఉంటే, ఈ రంగంపై భారీ ప్రతికూల ప్రభావం ఉంటుంది అని అన్నారు.