బడ్జెట్ 2021-22: ఈ ఏడాది బడ్జెట్ ప్రత్యేకత, కొత్త విషయాలు ఏంటో తెలుసుకోండి..

దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ ను నేడు సమర్పించారు. కేంద్ర బడ్జెట్ 2021లో మొదటిసారి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. భారతదేశ చరిత్రలోనే మొదటిసారి బడ్జెట్ ను   పేపర్ లెస్ గా ప్రవేశపెట్టారు.

budget 2021-22: check out this year budget specality and intresting changes made by finance ministry

కరోనా యుగంలో దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ ను నేడు సమర్పించారు. కేంద్ర బడ్జెట్ 2021లో మొదటిసారి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. భారతదేశ చరిత్రలోనే మొదటిసారి బడ్జెట్ ను   పేపర్ లెస్ గా ప్రవేశపెట్టారు. బడ్జెట్ 2021-22 మేడ్ ఇన్ ఇండియా టాబ్‌లో  తీసుకొచ్చారు. అయితే ఆ టాబ్ ఏ కంపెనీకి చెందినదో కూడా రహస్యంగా ఉంచారు.

లెడ్జర్ ఖాతా స్థానంలో ట్యాబ్ 
ఈ బడ్జెట్‌ను లెడ్జర్ ఖాతా నుండి ట్యాబ్ ద్వారా భర్తీ చేశారు. ఈసారి బడ్జెట్ డిజిటల్ (పేపర్‌లెస్) బ్లెట్ ద్వారా చదివి వినిపించారు.  
 
బడ్జెట్ కోసం మొబైల్ యాప్‌
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల యూనియన్ బడ్జెట్ అనే మొబైల్ యాప్‌ను విడుదల చేసింది, దీనిని గూగుల్ ప్లే-స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బడ్జెట్ సమర్పించిన తరువాత, మొత్తం బడ్జెట్ వివరాలు ఈ మొబైల్‌ యాప్ లో అప్‌లోడ్ చేయబడతాయి .

also read ముగిసిన బడ్జెట్ 2021-22 సమావేశం.. బడ్జెట్ ముఖ్యాంశాలు, పూర్తి సమాచారం ఇదే... ...

బడ్జెట్ చరిత్రలోనే ప్రభుత్వం బడ్జెట్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఈ యాప్ జాతీయ సమాచార కేంద్రం (ఎన్‌ఐసి) తయారు చేసింది. ఈ యాప్ హిందీ, ఆంగ్ల భాషలలో అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే, మీరు బడ్జెట్ డిజిటల్ కాపీని యాప్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

డిజిటల్ సెన్సస్
దేశంలో డిజిటల్ జనాభా జరగడం ఇదే మొదటిసారి. డిజిటల్ జనాభా లెక్కల కోసం ప్రభుత్వం 3,760 కోట్ల రూపాయల గ్రాంటును ప్రకటించింది, డిజిటల్ జనాభా లెక్కల కోసం ఏ విధానాన్ని అనుసరిస్తారో ఇంకా చెప్పలేదు. జనాభా గణన ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేసే అవకాశం ఉండొచ్చు లేదా జనాభా లెక్కల అధికారులు ఫారమ్‌కు బదులుగా ట్యాబ్‌ను ఉపయోగించవచ్చు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios