న్యూఢిల్లీ: సమాజంలో పెరిగిపోతున్న అసమానతలు, వస్తువుల వినియోగం ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పడిపోతున్న నేపథ్యం దేశీయ ఆర్థిక వ్యవస్థ పరిస్థితికి ప్రతిబింబంగా మారింది. ఈ నేపథ్యంలో నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ పేదరిక నిర్మూలనకు గతంలో ప్రకటిస్తున్న తన వ్యూహాన్ని పునరుద్ఘాటించారు. 

also read బడ్జెట్ 2020:విద్యుత్ వాహనాలకు ‘నిర్మల’మ్మ ప్రోత్సాహాలిస్తారా...?

దేశంలోకెల్లా సంపన్నులపై పన్నులు విధించాలని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌కు సూచించారు. సంపన్నులపై విధించిన పన్ను రూపంలో వచ్చే ఆదాయాన్ని పేదలకు పంచాలని సూచించారు.పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో జరిగిన లిటరీ ఫెస్టివల్‌లో దేశీయ ఆర్థిక వ్యవస్థలో విభిన్న కోణాలను, ప్రతికూల పరిస్థితులను వివరించారు అభిజిత్ బెనర్జీ.

సంపన్నులపై పన్నులు విధించడం చాలా సున్నితమైన అంశం. కార్పొరేట్ ఇండియా వద్ద పుష్కలంగా ఆదాయం ఉంది. కానీ గతేడాది సెప్టెంబర్ నెలలో కార్పొరేట్ ట్యాక్స్‌ను గణనీయంగా తగ్గించి మదుపర్లు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. 

also read బడ్జెట్‌ 2020:కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యంగా మూడు అంశాలపైనే ఆశలు...ఏంటంటే ?

ప్రస్తుతం భారతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం నుంచి సాగుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్, మౌలిక వసతుల రంగంలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా రంగాలకు నిధులు సమకూర్చాలని సూచించారు. బ్యాంకింగ్ రంగంలో రికవరీ సాధించే వరకు ఆ రంగ మదుపర్లు వేచి ఉండాలని అడ్వైజ్ చేశారు. 

ఎయిర్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభిజిత్ బెనర్జీ సమర్థించారు. ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ రంగ సంస్థల విక్రయాలను ప్రేమిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా సమకూరిన నిధులను సంక్షేమ పథకాలకు ఖర్చు చేయాలని కోరారు.