ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి కళ్లు.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పైనే ఉన్నాయి. నేడు ఆమె కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో  బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలాసీతారమన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది రెండో సారి కావడం విశేషం. గతేడాది కూడా ఇదే హోదాలో ఆమె బడ్జెట్ ని ప్రవేశపెట్టారు.

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఆమె పద్దుల సంచితో పార్లమెంట్ కి వచ్చారు. గతంలో అందరూ ఆర్థిక శాఖ మంత్రులు లెదర్ బ్యాగులతో అడుగుపెట్టేవారు. ఆ సంప్రదాయాన్ని నిర్మలమ్మ మార్చేశారు. 

 కాగా.. ఈసారి ఆమె ప్రవేశపెడుతున్న బడ్జెట్ ని వేనేందుకు కుమార్తె వాజ్మయి కూడా పార్లమెంట్ కు వచ్చారు. ఆమెతోపాటు నిర్మల కుటుంబసభ్యులు కూడా రావడం విశేషం. పార్లమెంట్ సిబ్బంది, అధికారులు వీరిని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్లారు. ఇదిలా ఉంటే...  2019 బడ్జెట్ సమయంలో నిర్మలా సీతారామన్ తల్లిదండ్రులు బడ్జెట్ వినడానికి వచ్చారు. అప్పుడు పేరెంట్స్ ని, ఇప్పుడు కుమార్తెను ఆమె తీసుకురావడం విశేషం.