న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి దఫా ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయం నోట్ల రద్దు చేసిన తర్వాత బ్యాంకేతర ఆర్థిక రంగం (ఎన్బీఎఫ్సీ) కుదేలైంది. తీవ్ర నగదు కొరత సమస్యతో కంపెనీలు అష్టకష్టాలు పడ్డాయి. దిగ్గజ సంస్థలు సైతం విలవిల్లాడాయి. ఆ తర్వాత కోలుకునే అవకాశాలను ఆర్థిక మందగమనం దెబ్బ తీసింది. 

ఫలితంగా ఎన్బీఎఫ్సీ రంగ కంపెనీలు పూర్తిగా కోలుకోవడానికి అవకాశం లభించలేదు. ఈ పరిస్థితుల్లో 2020 బడ్జెట్లో ఎన్బీఎఫ్సీల పునరుద్ధరణ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేయనున్న ప్రతిపాదనలు కీలకమైనవి కానున్నాయి. ఎన్బీఎఫ్సీల పునరుద్ధరణకు కేంద్రం కూడా తీవ్రంగానే కసరత్తు చేస్తోంది. ఎన్బీఎఫ్సీ రంగానికి ఉపశమనం కలిగించడానికి అమెరికాలో కొనసాగిస్తున్న విధానం మాదిరిగానే ట్రబుల్డ్ రిలీఫ్ ప్రోగ్రామ్ (టీఏఆర్పీ) పేరుతో ప్రత్యేక ప్రభుత్వ నిధిని ఏర్పాటు చేసేందుకు బడ్జెట్‌లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 

also read Budget 2020: అదనపు పన్నులు తొలగించే అవకాశం... గోల్డ్ ఫండ్స్‌కు ఈసారి ఊరట..?

ఇదే తరహా 2008లో అమెరికాలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదిత పథకం ద్వారా ఇబ్బందుల్లో ఉన్న ఎన్బీఎఫ్సీ కంపెనీల ఆస్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక నిధి ద్వారా కొనుగోలు చేస్తారు. ఈ చర్యలతో ఎన్బీఎఫ్సీ రంగ కంపెనీలు కోలుకునేందుకు వీలు ఉన్నది. 

ఈ ప్రతిపాదనలపై రెండు రోజుల క్రితం కీలక ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. గతేడాది భారతదేశంలో ఎన్బీఎఫ్సీ రంగం తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొన్నది. రియల్ ఎస్టేట్ రంగంలో రుణాల సమస్యలు, ఆర్థిక మందగమనం ప్రభావంతో డిఫాల్ట్‌లు పెరిగాయి.

ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభంతో మొదలైన తీవ్రమైన ఒత్తిడి ఫైనాన్సియల్ రంగాన్ని కుదిపేసింది. ఎన్బీఎఫ్సీ కంపెనీలకు పేమెంట్లు తగ్గి, డిఫాల్ట్‌లు పెరిగాయి. నానా కష్టాలు ఎదుర్కొన్న కంపెనీల్లో డీహెచ్ఎఫ్ఎల్ కూడా ఉన్నది. పరిస్థితులు దారుణంగా దిగజారడంతో కేంద్ర బ్యాంకు ఆర్బీఐ కూడా రంగంలోకి దిగింది. కంపెనీల వారీగా ప్రత్యేక ఉద్దీపనలు ప్రకటించింది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఒత్తిళ్లు కూడా ఎన్బీఎఫ్సీ రంగంపై ప్రభావం చూపాయి. వినియోగదారుల వ్యయాలు భారీగా తగ్గిపోవడం ఒత్తిడి పరిస్థితికి ప్రధాన కారణంగా నిలిచింది.

ఎన్బీఎఫ్సీ రంగం ఆకాంక్షలేమిటో శ్రీరాం ట్రాన్స్ పోర్ట్ ఎండీ సీఈఓ ఉమేశ్ రేవాంకర్ తెలిపారు. నగదు కొరత సమస్య పరిష్కారమైందన్నారు. ఎన్బీఎఫ్సీ సంస్థలను గట్టెక్కించేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్రం నుంచి వస్తున్న సమాచారం నిజమైతే ఆలోచన మంచిదేనన్నారు. 

also read Budget 2020:‘ఎగ్గొట్టే వాళ్లకు అప్పులిచ్చినా... బ్యాంకులకు మళ్లీ నిధులివ్వాలా...?

ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధంగా ఉంటే ఎన్బీఎఫ్సీల్లో విశ్వాసం పెరుగుతుంది. రుణాల జారీ మరింత సులభంగా మారుతుంది. ప్రస్తుతం రుణాల జారీ 10-15 పాయింట్ల మేరకు తగ్గించిందన్నారు. అయితే బ్యాంకుల పరిస్థితి మెరుగు పడటంతో రుణాల జారీ ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు.

ఇదిలా ఉంటే, ఎన్బీఎఫ్సీలకు ఫర్మినెంట్ రీ ఫైనాన్స్ విండోను ఏర్పాటు చేస్తూ బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్బీఎఫ్సీ రంగం విజ్నప్తి చేసింది. ఈ ప్రతిపాదనలు చేస్తే నిధుల లభ్యత పెరుగుతుందన్నది. భారీ స్థాయిలో పబ్లిక్ డిపాజిట్లు పొందేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్బీఎఫ్సీ రంగం కోరుతోంది. 2018 సెప్టెంబర్ నెలలో సంభవించిన ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం వెలుగు చూసిన తర్వాత ఎన్బీఎఫ్సీలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు వెనుకాడుతుండటంతో వాటి సవాళ్లు మరింత పెరిగాయి. 

ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ వెలుపల నుంచి కూడా రుణాలు తీసుకునే వెసులుబాటును తమకు కల్పించాలని ఎన్బీఎఫ్సీలు కోరుతున్నాయి. ఇందుకు రీ ఫైనాన్స్ విండో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్బీఎఫ్సీ రంగంలో ఈ డిమాండ్ సుదీర్ఘ కాలంగా వస్తున్నదని ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ రమేశ్ అయ్యర్ పేర్కొన్నారు. రిటైల్ మార్కెట్లో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు విడుదల చేసేందుకు అనుమతించాలని కోరారు.