budget 2020: మధ్యతరగతి వారికి గుడ్ న్యూస్...రూ. 7 లక్షల దాకా.. నో ట్యాక్స్...
రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయం గల వారికీ 5 శాతం పన్ను మాత్రమే ప్రతిపాదించే వీలుందని సమాచారం. ప్రస్తుతం రూ.2.5 లక్షలదాకా వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్నులు లేవన్న విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది సమర్పించే బడ్జెట్ ప్రతిపాదనల్లో మధ్యతరగతి, వేతన జీవులకు గొప్ప ఊరట దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత ఆదాయంపై పన్ను శ్లాబుల మార్పులుండవచ్చునని తెలుస్తున్నది. రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయం గల వారికీ 5 శాతం పన్ను మాత్రమే ప్రతిపాదించే వీలుందని సమాచారం.
ప్రస్తుతం రూ.2.5 లక్షలదాకా వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్నులు లేవన్న విషయం తెలిసిందే. రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఐదు శాతం పన్ను అమలులో ఉంది. భారతదేశాన్ని ఆర్ధిక మాంద్యం పట్టి పీడిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందుకోసం మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తోందని సమాచారం వినిపిస్తుంది.
also read Budget 2020: బడ్జెట్ ముందు ఆర్బిఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు...
ఇందులో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే ఆర్ధిక బడ్జెట్‌లో ఉద్యోగులకు కొన్ని వరాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.రూ.7 లక్షల వరకూ ఆదాయం ఉన్న ఉద్యోగులకు పన్ను పరిమితిని 5 శాతానికే ప్రతిపాదించడానికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇక గత ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన మధ్యంతర బడ్జెట్‌లో రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపును ఇచ్చిన సంగతి తెలిసిందే. అటు వార్షిక ఆదాయాల పన్నుల శ్లాబులలో కూడా పలు మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
రూ.5-7 లక్షల ఆదాయం ఉన్నవారికి 5 శాతం, 10-20 లక్షలు వార్షిక ఆదాయానికి 20 శాతం, అలాగే రూ. 20లక్షల నుంచి 10 కోట్లు మధ్య ఆదాయం ఉంటే 30 శాతం పన్నును ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయని సమాచారం వినిపిస్తుంది. ఒకవేళ ఇదే గనక జరిగితే వేతన జీవులకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉంటుంది.
also read మోదీ సర్కార్ తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌పై భారీ అంచనాలు...
చాలా మంది ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రూ.5 లక్షల్లోపు ఆదాయం గల వారిపై ఐదు శాతం పన్ను విదిస్తున్నారు. ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచితే ఎంతో మందికి పన్ను భారం తగ్గుతుంది.
2001లో బడ్జెట్ ప్రకటన సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు మార్చారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా ప్రతీ బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతూనే ఉన్నాయి. గడిచిన ఈ దాదాపు 20 ఏళ్లలో ఒక్కసారే శనివారం బడ్జెట్‌ను ప్రకటించగా, ఇప్పుడు మరోసారి శనివారమే అయ్యింది.