మొబైల్ ఫోన్లు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా...ఈ బడ్జెట్ లో మొబైల్ ఫోన్స్ ప్రియం అయ్యాయి. ఇప్పటికే పలు కంపెనీలు అతి తక్కువ ధరలకు స్మార్ట్ ఫోన్లను అందజేస్తున్నాయి. తాజా బడ్జెట్ తో వీటి ధర మరింత తగ్గనుంది.

సెల్యులార్ మొబైల్ ఫోన్స్‌లోని కెమెరా మాడ్యూల్, చార్జర్, అడాప్టర్‌లపై కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు మరింత తగ్గనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా శుక్రవారంనాడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. 

ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల మార్గెట్ అనూహ్యరీతిలో పెరుగుతూ వస్తోంది. ఇది 2018లో 14.5 శాతం పెరగగా, 2019లో 15 శాతానికి పెరగనుందని, 2021 నాటికి ఇండియాలో మొబైల్ సబ్‌స్క్రిప్షన్ 1.4 బిలియన్లకు పెరగనుందని అంచనా.