Asianet News TeluguAsianet News Telugu

టాటా మోటార్స్ కొత్త ఎడిషన్.. హరియార్, సఫారి లుక్స్, ఫీచర్స్ అదిరిపోయాయిగా..

టాటా మోటార్స్ తాజాగా సఫారీ, హారియర్  కొత్త వెర్షన్ల బుకింగ్ ప్రారంభించింది. అయితే ఇప్పుడు కంపెనీ మూడుఎస్‌యూ‌విల డార్క్ రెడ్ ఎడిషన్‌ను విడుదల చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.

Tata is going to bring dark red editions of three SUVs, know when they will be launched
Author
First Published Feb 20, 2023, 1:58 PM IST

ఇండియాలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ త్వరలో మూడు ఎస్‌యూవీలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సమాచారాన్ని సంస్థ అందించింది. అయితే  వాటిని ఎప్పుడు లాంచ్ చేయవచ్చు, ఏ ఫీచర్లతో లాంచ్ చేస్తారు అనే  సమాచారం మీకోసం...

డార్క్ రెడ్ ఎడిషన్ 
టాటా మోటార్స్ తాజాగా సఫారీ, హారియర్  కొత్త వెర్షన్ల బుకింగ్ ప్రారంభించింది. అయితే ఇప్పుడు కంపెనీ మూడుఎస్‌యూ‌విల డార్క్ రెడ్ ఎడిషన్‌ను విడుదల చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ మూడు SUVలు Nexon, Harrier, Safari.

టీజర్‌ విడుదల 
కంపెనీ ఈ ఎస్‌యూ‌విల టీజర్‌ను సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ టీజర్‌లో మూడు SUVలను చూపించారు. ఇంకా డార్క్ రెడ్ ఎడిషన్ థీమ్‌లో కనిపిస్తాయి. కమింగ్ సూన్ అనే క్యాప్షన్ కూడా ఈ టీజర్ చివర్లో ఉంది. దీంతో ఈ మూడు SUVలు త్వరలో భారతీయ మార్కెట్లోకి విడుదల కావచ్చని భావిస్తున్నారు.

ఎలా ఉంటుందంటే 

సమాచారం ప్రకారం, మూడు SUVలను డార్క్ రెడ్ ఎడిషన్  ప్రవేశపెట్టబోతుంది. ఇందులో ఎన్నో కొత్త ఫీచర్లు కూడా  ఇచ్చారు, వీటిలో ADAS వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా, ప్రత్యేక డార్క్ థీమ్‌లోని ఈ SUVలను బ్లాక్ అండ్ రెడ్ కలర్స్ లో చూడవచ్చు.

టాటా కంపెనీకి ఇతర కంపెనీల నుంచి సవాళ్లు కూడా ఎదురవుతూనే ఉన్నాయి. మారుతి నుండి మహీంద్రా వరకు, ప్రతి ఒక్కరూ వాహనాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, వాటిలో కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో టాటా సేల్స్ కాస్త ప్రభావితం కావచ్చు. టాటా కొత్త ఫీచర్లు, కొత్త ఎడిషన్‌లను అందించడం ద్వారా సేల్స్ మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.

ఎప్పుడు లాంచ్
కంపెనీ ఇంకా  దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఇవ్వలేదు, అయితే మొదట సఫారి, హారియర్ కొత్త ఇంజన్‌తో లాంచ్ చేయబడుతుందని  కొంతకాలం తర్వాత మూడు SUVల డార్క్ రెడ్ ఎడిషన్ భారతీయ మార్కెట్లో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios