సారాంశం

ఈ కార్ గురించి మాట్లాడినట్లయితే  వులింగ్ ఎయిర్ EV లాగానే పెద్దగా ఉండే అవకాశం ఉంది. దీని పొడవు 2,974 ఎం‌ఎం, వెడల్పు 1,505 ఎం‌ఎం, ఎత్తు 1,631 ఎం‌ఎం, వీల్‌బేస్ 2,010ఎం‌ఎం ఉంటుంది.

బ్రిటిష్ ఆటోమోటివ్ ఎం‌జి మోటార్ ఇండియా రెండవ ఎలక్ట్రిక్ వెహికిల్ వచ్చే ఏడాది 2023 ప్రారంభంలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ కాంపాక్ట్ సిటీ కారు అవుతుంది. ఈ కారు తాజాగా ఇండోనేషియాలో జరిగిన G20 సమ్మిట్‌లో కనిపించింది, ఇండోనేషియాలో వులింగ్ ఎయిర్ EVని అధికారిక రవాణా వాహనంగా ఉపయోగించారు. జనవరి 5న ఇండియాలో విడుదల కానున్న MG ఎలక్ట్రిక్ కారు Wuling Air EVకి రీబ్యాడ్జ్ వెర్షన్.  ఈ ఎలక్ట్రిక్ వాహనం గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకొండి...

ఎం‌జి మోటార్ ఎలక్ట్రిక్ కారు సైజ్ 
ఈ కార్ గురించి మాట్లాడినట్లయితే  వులింగ్ ఎయిర్ EV లాగానే పెద్దగా ఉండే అవకాశం ఉంది. దీని పొడవు 2,974 ఎం‌ఎం, వెడల్పు 1,505 ఎం‌ఎం, ఎత్తు 1,631 ఎం‌ఎం, వీల్‌బేస్ 2,010ఎం‌ఎం ఉంటుంది. అలాగే టియాగో EV కంటే చిన్నదిగా ఉంటుంది అంతేకాదు PMV ఎలక్ట్రిక్ నుండి కొత్తగా ప్రారంభించబడిన Eas-E మైక్రో EVని పోలి ఉంటుంది. 

 MG నుండి రానున్న ఈ ఎలక్ట్రిక్ వాహనం ప్రస్తుతం ఇండోనేషియాలో విక్రయించబడుతున్న వులింగ్ ఎయిర్ EVపై ఆధారంగా  ఉంటుంది.  గ్లోబల్ స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (GSEV) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌ను మల్టీ బాడీ స్టయిల్ కు అనుగుణంగా మార్చుకోవచ్చు. భారతదేశంలో ఈ కాంపాక్ట్ EVని E230 అనే కోడ్ నేమ్ చేయబడింది.

బ్యాటరీ పవర్ 
Wuling Air EV రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది, ఇందులో  ఒకటి 17.3 kWh యూనిట్ అండ్ మరొకటి పెద్ద 26.7 kWh యూనిట్. చిన్న బ్యాటరీ 200 కి.మీల పరిధిని అందిస్తుందని, పెద్ద బ్యాటరీ 300కిమీల పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. రెండు బ్యాటరీ ప్యాక్‌లు బ్యాక్ ఆక్సైల్ పై ఎలక్ట్రిక్ మోటారును పొందుతాయి, అలాగే 41 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. MG ఎయిర్ EV వెర్షన్ ధర సుమారు రూ. 10 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.