Asianet News TeluguAsianet News Telugu

కొత్త ఏడాదిలో మారుతీ సుజుకీ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. వేలకు పైగా కార్లకు రీకాల్.. కారణం ఏంటంటే..?

మారుతీ సుజుకీ తాజాగా దేశవ్యాప్తంగా 17 వేలకు పైగా కార్లను రీకాల్ చేసింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. సమాచారం ప్రకారం, కంపెనీ మొత్తం 17,362 కార్లను రీకాల్ చేసింది.

Maruti Suzuki recalled more than 17 thousand cars, know what was the fault-sak
Author
First Published Jan 18, 2023, 5:28 PM IST

ఇండియాలోని అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ కొత్త సంవత్సరంలో తొలిసారిగా కార్లను రీకాల్ చేసింది. మారుతి కార్లలో లోపం గురించి సమాచారం అందుకున్న తర్వాత కంపెనీ 17,000 కంటే ఎక్కువ కార్లకు రీకాల్  జారీ చేసింది. ఎలాంటి లోపం కారణంగా కంపెనీ ఈ  కార్లను రీకాల్ చేసింది, దానికి ఎంత చర్క్ అవుతుందో పూర్తిగా తెలుసుకోండి..

మారుతీ సుజుకీ తాజాగా దేశవ్యాప్తంగా 17 వేలకు పైగా కార్లను రీకాల్ చేసింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. సమాచారం ప్రకారం, కంపెనీ మొత్తం 17,362 కార్లను రీకాల్ చేసింది.

ఏ కార్లు ఉన్నాయంటే 
కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం 17,362 కార్లను రీకాల్ చేశారు. వాటిలో ఆల్టో కె-10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బాలెనో ఇంకా గ్రాండ్ విటారా వంటి కార్లు ఉన్నాయి. ఈ కార్లు 8 డిసెంబర్ 2022 నుండి 12 జనవరి 2023 మధ్య తయారు చేయబడ్డాయి.

లోపం ఏంటంటే 
మారుతి ఇచ్చిన సమాచారం ప్రకారం, డిసెంబర్ 2022 నుండి 12 జనవరి 2023 ఈ కాలంలో తయారు చేసిన కార్లలోని ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌ను చెక్ చేస్తారు ఇంకా ఈ భాగంలో లోపం ఉన్నట్లు గుర్తిస్తే  సరిచేస్తారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్లు పనిచేయకపోవడంతో చాలా కార్లను రీకాల్ చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. దీనితో పాటు, ఈ లోపాన్ని క్లియర్ చేసే వరకు ఈ కార్లను ఉపయోగించవద్దని కంపెనీకి సూచించింది.

 సర్వీస్ సెంటర్ 
రీకాల్ చేసిన అన్ని కార్ల యజమానులను సంప్రదించడమే కాకుండా, ఈ కాలంలో తయారు చేసిన కార్లను కొన్న వారు వీలైనంత త్వరగా సమీపంలోని డీలర్‌ను సంప్రదించి, లోపం ఉన్న పార్ట్‌ను చెక్ చేసిన తర్వాత వాటిని సరిచేయించుకోవాలని  కంపెనీ విజ్ఞప్తి చేస్తోంది.

ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు
 లోపాలు ఉన్న కార్లను రిపేర్ చేయడానికి కస్టమర్లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వారు కేవలం వారి కారును సమీపంలోని సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్తే సరిపోతుంది. అక్కడ వారి కారుని చెక్ చేయబడుతుంది ఇంకా లోపం ఉన్న పార్ట్ రీప్లేస్ లేదా రిపేర్ చేయబడుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios