Asianet News TeluguAsianet News Telugu

ఐ10 Vs స్విఫ్ట్: హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ లేదా మారుతి, టాటా కార్లు.. ఏ కారు మీకు బెస్ట్ తెలుసుకోండి..

గ్రాండ్ ఐ10 నియోస్‌ను హ్యుందాయ్ రూ. 5.68 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. దీని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.46 లక్షలు. కంపెనీ ఎక్ట్సీరియర్ ఇంకా ఇంటీరియర్‌లో ఎన్నో మార్పులు చేసింది. 

i10 Vs Swift: Hyundais Grand i10 Nios is better or Maruti and Tata will be best for you know details-sak
Author
First Published Jan 23, 2023, 12:46 PM IST

గ్రాండ్ ఐ10 నియోస్‌ను దక్షిణ కొరియా కార్ కంపెనీ హ్యుందాయ్ తాజాగా లాంచ్ చేసింది. అయితే హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఈ కారును కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ విభాగంలో మారుతి నుండి స్విఫ్ట్ వంటి కారు కూడా ఇప్పటికే మార్కెట్‌లో ఉంది. మీరు గ్రాండ్ ఐ10 నియోస్‌ని కోనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ కారు మీకు బెస్ట్ ఆ లేదా మారుతి స్విఫ్ట్ ఇంకా టాటా టియాగోను  కొనడం ప్రయోజనకరంగా ఉంటుందా తెలుసుకొండి...

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లో ప్రత్యేకత ఏమిటి
గ్రాండ్ ఐ10 నియోస్‌ను హ్యుందాయ్ రూ. 5.68 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. దీని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.46 లక్షలు. కంపెనీ ఎక్ట్సీరియర్ ఇంకా ఇంటీరియర్‌లో ఎన్నో మార్పులు చేసింది. 2023 గ్రాండ్ i10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ లో 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌ ఉంది, ఈ కారు 82 bhp 113.8 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ అండ్ AMT గేర్  ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఉంది. CNG ఆప్షన్ కూడా కంపెనీ అందించింది, ఇంకా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. CNG వెర్షన్ 68 PS పవర్, 95.2 న్యూటన్ మీటర్ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్  గేర్ ట్రాన్స్‌మిషన్‌తో ఆవరేజ్ గా 20.7 kmpl, AMT వెర్షన్‌లో 20.1 kmplని క్లెయిమ్ చేస్తుంది. గ్రాండ్ i10 నియోస్ కూడా ఇథనాల్ 20V ఆప్షన్ పొందుతుంది. దీనికి స్టాండర్డ్‌గా నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, టాప్ వేరియంట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించారు.

మారుతీ స్విఫ్ట్
మారుతి అత్యంత ఇష్టపడే హ్యాచ్‌బ్యాక్ కారు స్విఫ్ట్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 5.92 లక్షలు, దీని టాప్ వేరియంట్ ధర రూ. 8.71 లక్షలు. కంపెనీ 1197 సిసి ఇంజన్ ఇందులో ఇచ్చింది. ఈ కారణంగా కారు 89.73 PS పవర్, 113 న్యూటన్ మీటర్ల టార్క్ ఇస్తుంది. ఇందులో లభించే ఇంజన్ లేటెస్ట్ K సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్. ఇంకా మాన్యువల్ అండ్ AMT ట్రాన్స్మిషన్ ఆప్షన్  పొందుతుంది. దీనితో పాటు, CNG ఆప్షన్ కూడా ఇందులో అందించబడుతుంది. CNG-ఆధారిత స్విఫ్ట్ 77.49 PS, 98.5 Nm టార్క్‌ను అందిస్తుంది. అల్లాయ్ వీల్స్, DRLలు, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ISOFIX చైల్డ్ ఎంకరేజ్‌లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఫాగ్ ల్యాంప్స్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, స్మార్ట్‌ఫోన్ కనెక్ట్, స్టూడియో, క్రూయిజ్ కంట్రోల్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, టచ్‌స్క్రీన్ స్మార్ట్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. 

టాటా టియాగో
ఈ విభాగంలో టియాగో కారును టాటా అందిస్తోంది. టియాగో ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 5.45 లక్షలు కాగా, దాని టాప్-ఎండ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.90 లక్షలు. ఈ కారులో, కంపెనీ 1199 cc మూడు-సిలిండర్ ఇంజిన్‌ను అందిస్తుంది, ఈ కారుకు 86 PS, 113 న్యూటన్ మీటర్ల టార్క్ ఇస్తుంది. CNGతో  73.4 PS శక్తిని, 95 న్యూటన్ మీటర్ల టార్క్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ తో మాన్యువల్ ఇంకా ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌  కూడా ఉంది. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా ABS, EBD, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ఫాలో మీ హెడ్‌ల్యాంప్స్, రియర్ వాషర్, వైపర్ విత్ డిఫాగర్, పంక్చర్ రిపేర్ కిట్, 17.78 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios