వేద సమయానుసారం ఒక చాంద్రమానరోజును తిథి అంటారు. శుక్లసక్షంలో పాడ్యమినుండి పూర్ణిమ వరకు 15, మళ్ళీ కృష్ణ పక్షంలో పాడ్యమి నుండి అమావాస్య వరకు  15 మొత్తం 30 తిథులు. రవి చంద్రుల మధ్య దూరం 0 డిగ్రీ ఉన్నప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. 180 డిగ్రీలు దూరమున్నప్పుడు పూర్ణిమ ఏర్పడుతుంది. చంద్రుడు రవి నుండి ప్రతి 12 డిగ్రీలు నడిచినపుడు తిథులు మారుతాయి.

మనం దేవతలను పలురకాలుగా మనకు వీలైన రీతిలో పూజిస్తూ ఉంటాం. ఆ విధంగా చేసే పూజలు నియమ నిష్ఠలతో చేసినట్లైతే తగిన ఫలితం వస్తుంది. దీనికి సంబంధించిన తిథులు, వాటి ప్రత్యేకత ఏ రోజు ఏ దేవతను పూజిస్తే ఎంతి ఫలం కలుగుతుందో తెలుసుకుందాం.

పాడ్యమి : అశ్విని దేవతలను ఆరాధించాలి. వారు ఆ తిథినాడు ప్టుటినందువల్ల ఏడాదిపాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విదియ వ్రతాన్ని నియమ నిష్టలతో చేస్తే శుభప్రదం.

తదియ : గౌరీదేవిని పూజించాలి. గౌరీ కళ్యాణం తదియనాడు జరిగినందువల్ల, గౌరీ దేవికి ఆ తిథి అంటే ఇష్టం. ఇది ప్రత్యేకంగా స్త్రీలకోసం ఏర్పాటు అయినది.

చవితి : వినాయకుడు పుట్టినతిథి. వినాయకచవితినాడే కాకుండా ప్రతీ చవితినాడు వినాయకుడిని పూజించవచ్చు.

పంచమి : పంచమినాడు నాగులు జన్మించాయి. అందుకే నాగదేవతలకు పంచమితిథి, నాగుల చవితి అంటే చాలా ఇష్టం. ప్రతీ పంచమినాడు పుట్టలో పాలు పోసి నాగ పూజచేస్తే నాగుల వల్ల భయం ఉండదు.

షష్ఠి : కుమారస్వామి/ సుబ్రహ్మణ్యస్వామి జన్మతిథి/ ఆ రోజున అర్చన చేసినట్లైతే సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందగలరు.

సప్తమి : సూర్యుని జన్మతిథి. రథసప్తమినాడే కాకుండా ప్రతీ శుద్ధ సప్తమినాడు సూర్యుడిని ఆరాదించి క్షీరానాన్ని నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు కలుగుతాయి.

అష్టమి : దుర్గాదేవి అష్టమాతృకలు ఆవిర్భవించిన తిథి. అష్టమాతృకలను, దుర్గాదేవిని పూజిస్తే శుభం కలుగుతుంది.

నవమి : దుర్గాదేవికి ప్రీతికరమైనది. ఆ తిథినాడు దుర్గను పూజించి ఉపవాసం ఉంటే సంపదలు కలుగుతాయి.

థమి : థమినాడు దిక్కుల సృష్టి జరిగింది. ఇంద్రాదిదేవతలు ఈ దిక్కులకు పాలకులు. దిక్పాలకులను పూజిస్తే పాపాలు తొలగుతాయి.

ఏకాదశి : కుబేరుడు పుట్టిన తిథి. ఈ తిథిన కుబేరపూజ చేస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది.

ద్వాదశి : విష్ణువుకు ఇష్టమైన తిథి. ఈ తిథిరోజే విష్ణుమూర్తి, వామన రూపంలో జన్మించాడు. ద్వాదశినాడు ఆవునెయ్యితో వ్రతం చేస్తే పుణ్యం లభిస్తుంది.

త్రయోదశి : ధర్మరాజు పుట్టిన తిథి. ఈ రోజున ఎవరికి ఇష్టమైన దేవుడిని వారు తలచుకొని పూజిస్తే ఫలం చేకూరుతుంది.

చతుర్దశి : రుద్రుని తిథి. ఆనాడు రుద్రార్చన చేసినట్లైతే శుభప్రదం. కృష్ణ చతుర్దశినాడు మాస శివరాత్రి వస్తుంది. ఈ తిథి శివుడికి ప్రీతికరం.

అమావాస్య : పితృదేవతలకు ఇష్టమైన తిథి. దర్భలు, నువ్వులు, నీళ్ళతో పితృదేవతలకు తర్ణణమిస్తే వారు సంతోషించి సంతానసౌఖ్యం అనుగ్రహిస్తారు.

పౌర్ణమి : చంద్రుడు అధిపతి. పౌర్ణమినాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి చంద్రుడిని పూజించినట్లైతే ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి.

కావున ప్రతీ ఒక్కరు ఆయా తిథులరోజున ఆ దేవతలను పూజించి ఆనందాన్ని పొందగలరు.

డా.ఎస్.ప్రతిభ