''అప్రత్యక్షాణి శాస్త్రాణి వివాదస్తేషు కేవలం

ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కౌ తత్ర సాక్షిణౌ''

చంద్ర సూర్యుల సాక్షిగా ఈ శాస్త్రం ప్రత్యక్ష ఫలితాలనందిస్తుంది.

జాతక పరిశీలన ఎవరిది వారికే ఉంటుంది.  వీటిలో మొత్తం 12 రాశులు, 27 నక్షత్రాలు, 9 గ్రహాలు ఉంటాయి. ఈ 12 రాశులను వాటి తత్త్వాల ఆధారంగా అగ్ని, భూ, వాయు, జల అని 4 రకాలుగా విభజించారు. మేషం, సింహం, ధనస్సు- అగ్నితత్త్వాలు; వృషభం, కన్య, మకరం-భూ తత్త్వాలు; మిథునం, తుల, కుంభం - వాయుతత్త్వాలు; కర్కాటకం, వృశ్చికం, మీనం జలతత్త్వాలు.

అగ్ని తత్త్వరాశులు : వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. చురుకుదనం. తమ శక్తిపై నమ్మకం ఎక్కువ. వీరి శరీరంలో కూడా వేడి ఎక్కువగా ఉంటుంది. వీరు చల్లటి వస్తువులను ఎక్కువగా స్వీకరించాలి. శీతలీ ప్రాణాయామాలు చేస్తూ ఉండాలి. జీర్ణశక్తి బాగా ఉంటుంది. ముందు వెనుకలు చూడకుండా ఎలాంటి పోటీనైనా తట్టుకునే శక్తి కలిగి ఉంటారు. అంటే కొండనైనా ఢీకొనడానికి సిద్ధంగా ఉంటారు. 

అగ్ని తత్త్వాలలో కూడా మేషం. సింహం, ధనస్సు. ఇందులో మేషం అగ్ని తత్త్వరాశి, చర స్వభావం కలది, సింహం చర స్వభావం కలది, ధనస్సు, ద్వి స్వభావం కలది.  వీటిని బట్టి కూడా ఫలితాల్లో మార్పులు ఉంటాయి.

భూతత్త్వరాశులు : వీరికి ఆహారంపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. వీరికి అరుగుదల తక్కువగా ఉంటుంది. భూతత్వం కాబట్టి తిరగడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఒకచోట కూర్చుండి చేసే పనులు అంటేనే ఎక్కువగా ఇష్టపడతారు. మొదలుపెట్టిన పనిని పూర్తి చేసేవరకు వదలిపెట్టరు.  భూమీ అన్నీ తనలోకి తీసుకుని మొక్కలు ఎలాగైతే పెరుగుతాయో వీరికి కూడా గ్రోత్‌ ఎక్కువగా ఉంటుంది. ముందుజాగ్రత్తలు ఎక్కువగా ఉంటాయి. భయం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. 

భూతత్త్వంలో వృషభం, కన్య, మకరం. వృషభం స్థిరస్వభావం కలది, కన్య ద్విస్వభావం కలది. మకరం చర స్వభావం కలది. వీటిని బట్టి కూడా ఫలితాల్లో మార్పులు ఉంటాయి.

వాయుతత్త్వరాశులు : అన్ని విషయాలను కలుపుకుపోయే తత్త్వం ఉంటుంది. వీరికి తిరిగే పనులు అంటే ఇష్టం. వాయువు మంచి చెడు దేన్నైనా తనతో తీసుకుపోయే తత్త్వం కలగి ఉంటుంది. అలాగే ఈ వాయుతత్త్వరాశుల వారు కూడా ఏ వార్తనైనా ఎదుటివారికి అందజేసే ప్రయత్నం చేస్తారు. అది మంచి చెడుతో సంబంధం లేదు. మీడియా రంగాన్ని తీసుకుంటే మంచి వార్తలు చెడు వార్తలు అన్నీ చూపిస్తారు. వార్త అనేది ముఖ్యం వీరికి. ఈ వాయుతత్త్వరాశుల వారు కూడా అలాగే ఉంటారు.

వాయుతత్త్వరాశుల్లో మిథునం, తుల, కుంభం. మిథునం ద్వి స్వభావం కలది, తుల చర స్వభావం కలది, కుంభం స్థిర స్వభావం కలది. 

వాయుతత్త్వరాశులు :జవీరికి భయం ఎక్కువ. ఎప్పుడూ ఎవరో ఒకరి సపోర్ట్‌ లేకుండా ఉండరు. అలాగే సర్దుకుపోయే తత్త్త్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయానికి తమ పనులు పూర్తి చేయించుకుంటారు. చిన్న కదలిక ఏదైనా వెంటనే భయపడతారు. ఊహల్లో ఎక్కువగా విహరిస్తారు. ప్రతీదానికి స్పందన ఎక్కువగా ఉంటుంది. నీరు అంటే చాలా ఇష్టం. వీరికి  రొంప కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు శరీరంలో వేడిని పుట్టించే ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం మంచిది.  

జలతత్త్వరాశుల్లో కర్కాటకం, వృశ్చికం మీనం. కర్కాటం చర స్వభావం, వృశ్చికం, స్థిర స్వభావం కలది, మీనం ద్వి స్వభావం కలది.