షాకింగ్ న్యూస్.. రేప్ కేసులో టీడీపీ నేత కుమారుడు

tdp leader son arrested in rape case
Highlights

అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు

గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన యువకుడు టీడీపీ నేత కుమారుడు కావడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా అమృతలూరుకి చెందిన టీడీపీ నేత నాగేశ్వరరావు గతంలో కూచిపూరి నీటి సంఘం అధ్యక్షుడుగా విధులు నిర్వర్తించారు. ఆయన కుమారుడు విష్ణుతేజ  స్థానికంగా ఉండే ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  అయితే.. తన కొడుకును కాపాడుకునేందకు టీడీపీ నేత నాగేశ్వరరావు విశ్వప్రయత్నాలు చేశారు.

బాధిత బాలిక కుటుంబానికి డబ్బులు ఇచ్చి కేసు పెట్టకుండా రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించారు. అయితే.. ఈ ప్రయత్నాన్ని గుంటూరు రూరల్ ఎస్పీ అప్పలనాయుడు అడ్డుకున్నారు. నిందితుడు విష్ణుతేజను అరెస్ట్ చేసి.. విచారిస్తున్నారు. 

loader