Andhra Pradesh Telangana Polling Live Updates : ఏపీలో 68 శాతం, తెలంగాణలో 61 శాతం పోలింగ్

Polling Updates in Andhra Pradesh And Telangana AKP

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ లో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే ఇవాళ ఇరురాష్ట్రాల ప్రజలు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.  
 
10:38 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు లో బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి

ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగు లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ ముగుస్తున్న సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పట్టణ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో పోలింగ్ బూత్ 116, 117 లో బిజెపి, వైసిపి వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి వాహన అద్దాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.
 
6:02 PM IST

ఏపీలో జిల్లాల వారీగా పోలింగ్ నమోదు ఇలా..

అల్లూరి సీతారామరాజు – 55.17 
అనకాపల్లి – 65.97 
అనంతపురం – 68.04 
అన్నమయ్య – 67.63 
బాపట్ల 72.14 
చిత్తూరు – 74.06 
అంబేద్కర్ కోనసీమ -73.55 
ఈస్ట్ గోదావరి – 67.93 
ఏలూరు – 71.10 
గుంటూరు – 65.58 
కాకినాడ – 65.01 
కృష్ణ జిల్లా – 73.53 
కర్నూలు – 64.55 
నంద్యాల – 71.43 
ఎన్టీఆర్ జిల్లా – 67.44 
పల్నాడు – 69.10 
పార్వతీపురం మన్యం – 61.18 
ప్రకాశం – 71.00 
నెల్లూరు – 69.95 
సత్యసాయి జిల్లా – 67.16 
శ్రీకాకుళం – 67.48 
తిరుపతి – 65.88 
విశాఖ – 57.42 
విజయనగరం – 68.16 
పశ్చిమ గోదావరి – 68.98 
వైయస్ఆర్ జిల్లా – 72.85
 
5:50 PM IST

ఏపీలో 5 గంటల వరకు 68 శాతం పోలింగ్, తెలంగాణలో 61 శాతం పోలింగ్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 61. 16 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఏపీలో పలు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. కాగా.. సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదు.
 
5:32 PM IST

చంద్రగిరిలో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు

ఏపీలో ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణ కాలువలో వైసీపీ, టీడీపీ మధ్య ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి బీఎస్ఎఫ్ జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
 
5:05 PM IST

నరసరావుపేటలో ఉద్రిక్తత

ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. ఈ దాడిలో ఆయన కార్లను ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. 

4:44 PM IST

ప్రకాశం జిల్లా దర్శిలో ఈవీఎం ధ్వంసం

ఏపీలో పలుచోట్ల హింస్మాత సంఘటనలు జరిగాయి. ప్రకాశం జిల్లా దర్శిలోని మండల పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోగా.. సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
 
4:09 PM IST

ఏపీలో సమస్యాత్మక నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

- అరుకు, రంపచోడవరం, పాడేరు
 
4:06 PM IST

తెలంగాణ లో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

సిర్పూర్, 
ఆసిఫాబాద్, 
బెల్లంపల్లి, 
చెన్నూరు, 
మంచిర్యాల,
మంథని, 
భూపాలపల్లి, 
ములుగు, 
పినపాక, 
ఇల్లెందు, 
కొత్తగూడెం, 
అశ్వారావుపేట, 
భద్రాచలం నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది.

-- 9,900 సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్

- క్యూలో ఉన్నవారికే అవకాశం

4:01 PM IST

తెలంగాణలో పార్లమెంట్ వారిగా పోలింగ్ వివరాలిలా.. (3 గంటల వరకు)

ఆదిలాబాద్ - 62.44 శాతం, 
భువనగిరి - 62.05 శాతం, 
చేవెళ్ల - 42.35 శాతం, 
హైదరాబాద్‌- 29.47శాతం, 
కరీంనగర్‌ - 58.24 శాతం, 
ఖమ్మం - 63.67 శాతం, 
మహబూబాబాద్ - 61.40 శాతం, 
మహబూబ్‌నగర్‌ - 58.92 శాతం, 
మల్కాజ్‌గిరి - 37.69 శాతం,
మెదక్- 60.94 శాతం, 
నాగర్‌కర్నూల్‌- 57.17 శాతం, 
నల్లగొండ - 59.91 శాతం,
నిజామాబాద్‌లో 58.70 శాతం, 
పెద్దపల్లి- 55.92 శాతం, 
సికింద్రాబాద్‌- 35.48 శాతం, 
వరంగల్‌ - 54.17 శాతం, 
జహీరాబాద్‌ - 63.96 శాతం .
 
3:40 PM IST

తెలంగాణలో 52.30 శాతం దాటిన పోలింగ్...

తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోలింగ్ 52.30 శాతం మార్కు దాటింది.ఈ సారి రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వొచ్చనే ఎన్నికల సంఘం అధికారులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్‌లో 63.94 శాతం పోలింగ్ కాగా, మెదక్‌లో 60.94 శాతం, వరంగల్‌లో 54.17 శాతం, ఖమ్మంలో 63.67 శాతం పోలింగ్‌ నమోదు
 
3:32 PM IST

ఏపీలో 52 శాతం దాటిన పోలింగ్...

ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోలింగ్ 52 శాతం మార్కు దాటింది. ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వొచ్చనే ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.

3:23 PM IST

తెలంగాణలో 1 గంట వరకు 40.38శాతం పోలింగ్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్

1 గంట వరకు 40.38శాతం పోలింగ్ 

ఆదిలాబాద్ -50.18 శాతం
భువనగిరి -46.49 శాతం
చేవెళ్ల -34.56 శాతం
హైద్రాబాద్ -19.37 శాతం
కరీంనగర్-45.11 శాతం
ఖమ్మం-50.63 శాతం
మహబూబాబాద్-48.81 శాతం
మహబూబ్నగర్-45.84 శాతం
మల్కాజిగిరి-27.69 శాతం
మెదక్-46.72 శాతం
నాగర్ కర్నూల్ -45.88 శాతం
నల్గొండ-48.48 శాతం
నిజామాబాద్-45.67 శాతం
పెద్దపల్లి-44.87 శాతం
సికింద్రబాద్-24.91 శాతం
వరంగల్-41.23 శాతం
జహీరాబాద్-50.71 శాతం
 
2:43 PM IST

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ అభ్యర్థి మాధవీలత పై కేసు

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయ్యింది. పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించినందుకు అతడిపై మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇక హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కూడా మలక్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.
 
1:30 PM IST

ఒంటిగంట వరకు తెలంగాణ, ఏపీలో  40 శాతం పోలింగ్

తెలంగాణలో ఒంటిగంట వరకు  40 శాతం పోలింగ్ నమోదయ్యింది. 36 శాతంమంది మహిళలు, 35 శాతం మంది పురుషులు ఓటేసారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 40 శాతం పోలింగ్ నమోదయ్యింది. 
 
12:30 PM IST

ఓటుహక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓటేసారు. భార్య కూతురితో కలిసివెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇక ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు.    

12:12 PM IST

ఓటేసిన కేసీఆర్ ... మొదటిసారి ఓటేసిన హిమాన్షు

తెలంగాణ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని తన స్వగ్రామంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. చింతమడక పోలింగ్ బూత్ కు భార్య శోభతో కలిసివచ్చి ఓటేసారు కేసీఆర్. అయితే కేసీఆర్ తనయుడు కేటీఆర్ కుటుంబం మాత్రం హైదరాబాద్ లో ఓటేసింది. కేసీఆర్ మనవడు హిమాన్షు మొదటిసారి ఓటేసాడు. 

12:06 PM IST

హైదరాబాద్ ఓటర్లపై మంచులక్ష్మి సీరియస్....

హైదరాబాద్ లో సినీప నటులు మంచు లక్ష్మి, మంచు మనోజ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటేయడానికి బద్దకిస్తున్న హైదరాబాదీలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను  ఓటేయడానికే ముంబై నుండి హైదరాబాద్ వచ్చాను... కానీ ఇక్కడే వున్నవారు ఇళ్లలోంచి కూడా బయటకు రాకపోవడం దారుణమని మంచు లక్ష్మి ఆందోళన వ్యక్తం చేసారు.

11:39 AM IST

ఏపీ తెలంగాణలో 11 గంటలవరకు పోలింగ్ శాతం...

తెలంగాణలో ఉదయం 11 గంటల వరకు 24.25 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 24 శాతం పోలింగ్ నమోదయ్యింది. 
 
11:37 AM IST

ఓటేసినమాజీ మంత్రులు కేటీఆర్, హరీష్, మంత్రి సీతక్క

మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేటలో హరీష్, హైదరాబాద్ నందినగర్ లో కేటీఆర్ ఓటేసారు. మంత్రి సీతక్క కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు. 
 
11:15 AM IST

తెనాలి ఎమ్మెల్యే చెంపపగలగొట్టిన ఓటర్....

తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.స్థానిక ఎమ్మెల్యే ఓ ఓటర్ పై చేయిచేసుకోగా... ఆ ఓటర్ కూడా ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే అనుచరులంతాసదరు ఓటర్ పై దాడికి దిగారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు. 

11:01 AM IST

ఓటేసిన బాలకృష్ణ

హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

10:47 AM IST

హిందూపురంలో ఉద్రిక్తత...

సినీ హీరో బాలకృష్ణ పోటీచేస్తున్న హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిలమత్తూరు వైసిపి ఎంపిపిపై టిడిపి శ్రేణులు దాడికి దిగాయి. ఈ ఘటనలో పలువురు వైసిపి నేతలు గాయపడగా వాహనాలు ధ్వంసమయ్యాయి.   
 
10:30 AM IST

ఓటేసిన ఈటల, కొండా...

 చేవెళ్ల, మల్కాజ్ గిరి బిజెపి అభ్యర్థలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ లు కుటుంబసమేతంగా వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

10:06 AM IST

హైదరాబాద్ లో ఓవైసి, కరీంనగర్ లో బండి కుటుంబం ఓటు..

హైదరాబాద్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి, కరీంనగర్ లో బిజెపి నేత బండి సంజయ్ కుటుంబసమేతంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

9:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ లో 10 శాతం పోలింగ్

ఆంధ్ర ప్రదేశ్ లో ఉదయం 9 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదయ్యింది. 

9:30 AM IST

తెలంగాణ మందకోడిగా పోలింగ్... తొలి రెండు గంటల్లో కేవలం 9.51శాతం పోలింగ్

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభమై రెండు గంటలు గడుస్తున్నా ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదు కాలేదు. ఉదయం 9 గంటల వరకు కేవలం 9.51 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది 

9:12 AM IST

పులివెందులలో ఓటుహక్కు వినియోగించుకున్న వైఎస్ జగన్, భారతి దంపతుల ఫోటోలు

9:10 AM IST

మహిళలంతా ఓటేసేందుకు కదలండి : నారా భువనేశ్వరి పిలుపు

భర్త చంద్రబాబుతో కలిసివచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు నారా భువనేశ్వరి.  అనంతరం ఆమె రాష్ట్రంలోని మహిళలంతా ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.  

9:04 AM IST

ఓటేసిన పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోకి  లక్ష్మీనరసింహ స్వామి కాలనీ పోలింగ్ బూత్ లో ఆయన ఓటేసారు. భార్యతో కలిసివచ్చి ఓటేసారు. 

8:59 AM IST

నేను ఓటేసా... మీరూ వేయండి : విజయసాయి రెడ్డి

నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొండాయపాలెం పోలింగ్ కేంద్రంలో వైసిపి నేత విజయసాయిరెడ్డి ఓటుహక్కను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజాస్వామ్యానికి పండుగ రోజయిన ఇవాళ ప్రజలంతా  ఓటు వేసి మీ బాధ్యతను నిర్వర్తించాలని విజయసాయి కోరారు. 

8:49 AM IST

కిషన్ రెడ్డి ఈసికి ఫిర్యాదు...

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. ఓటు వేసాక మోడీ పేరు ప్రస్తావించడం ద్వారా కిషన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సీఈవోకు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. 
 
8:25 AM IST

మాచర్లలో ఉద్రిక్తత ... ఆలస్యంగా మొదలైన పోలింగ్

మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో రెంటాల గ్రామంలో పోలింగ్ కాస్త ఆలస్యంగా మొదలయ్యింది. అయితే పోలీసులు భారీగా మొహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

8:22 AM IST

ఓటేసిన డికె అరుణ, వంశీచంద్ రెడ్డి

మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థులు డికె అరుణ, వంశీచంద్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
 
8:13 AM IST

క్యూలైన్ నిలబడి ఓటేసిన చిరంజీవి దంపతులు

మెగాస్టార్ చిరంజీవి క్యూలైన్ లో నిలబడి ఓటుహక్కును వినియోగించుకోడానికి ఎదురుచూస్తున్నారు. భార్య సురేఖతో కలిసి ఆయన ఓటు వేసేందుకు వచ్చారు. 

8:07 AM IST

ఓటుహక్కును వినియోగించుకున్న కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి కాచీగూడలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని కాచిగూడలో దీక్ష మోడల్ స్కూల్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ కు కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

8:04 AM IST

సతీసమేతంగా వచ్చి ఓటేసిన చంద్రబాబు

తెలంగాణ మజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా భార్య భువనేశ్వరితో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని ఓ పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు దంపతులు ఓటేసారు. ఇక మంగళగిరిలో నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఓటేసారు.

7:44 AM IST

ఓటుహక్కు వినియోగించుకున్న సీఎం జగన్

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. తన సొంత జిల్లా కడపలోని పులివెందులలోని బాకరాపురం పోలింగ్ కేంద్రంలో జగన్ ఓటేసారు. ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఓటేసారు. 

7:35 AM IST

ఓటేసిన మాధవీ లత...

హైదరాబాద్ లోక్ సభ బిజెపి అభ్యర్థి మాధవీ లత ఓటుహక్కును వినియోగించుకున్నారు.

7:31 AM IST

మొరాయిస్తున్న ఈవీఎంలు

ఆంధ్ర ప్రదేశ్ తో  పాటు తెలంగాణలోనూ పలు పోలింగ్ కేంద్రాల్లో  ఈవిఎంలు మొరాయిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ పరిధిలోని సీతారామపురంలో ఈవీఎంలు పనిచేయడం లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో కూడా ఈవీఎంల సమస్య బయటపడింది. 

7:27 AM IST

ఓటేసిన అల్లు అర్జున్... క్యూలైన్ లో నిలబడ్డ జూ. ఎన్టీఆర్

సినీ నటులు అల్లు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూ. ఎన్టీఆర్ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు తల్లి, భార్యతో కలిసివచ్చారు. పోలింగ్ బూత్ వద్దక్యూలైన్ లో నిలబడి ఓటేసేందుకు ఎదురు చూస్తున్నారు. 

7:15 AM IST

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్

ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగనుంది.

10:38 PM IST:

ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగు లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ ముగుస్తున్న సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పట్టణ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో పోలింగ్ బూత్ 116, 117 లో బిజెపి, వైసిపి వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి వాహన అద్దాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.
 
6:03 PM IST:

అల్లూరి సీతారామరాజు – 55.17 
అనకాపల్లి – 65.97 
అనంతపురం – 68.04 
అన్నమయ్య – 67.63 
బాపట్ల 72.14 
చిత్తూరు – 74.06 
అంబేద్కర్ కోనసీమ -73.55 
ఈస్ట్ గోదావరి – 67.93 
ఏలూరు – 71.10 
గుంటూరు – 65.58 
కాకినాడ – 65.01 
కృష్ణ జిల్లా – 73.53 
కర్నూలు – 64.55 
నంద్యాల – 71.43 
ఎన్టీఆర్ జిల్లా – 67.44 
పల్నాడు – 69.10 
పార్వతీపురం మన్యం – 61.18 
ప్రకాశం – 71.00 
నెల్లూరు – 69.95 
సత్యసాయి జిల్లా – 67.16 
శ్రీకాకుళం – 67.48 
తిరుపతి – 65.88 
విశాఖ – 57.42 
విజయనగరం – 68.16 
పశ్చిమ గోదావరి – 68.98 
వైయస్ఆర్ జిల్లా – 72.85
 
5:50 PM IST:

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 61. 16 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఏపీలో పలు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. కాగా.. సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదు.
 
5:32 PM IST:

ఏపీలో ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణ కాలువలో వైసీపీ, టీడీపీ మధ్య ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి బీఎస్ఎఫ్ జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
 
5:05 PM IST:

ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. ఈ దాడిలో ఆయన కార్లను ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. 

4:44 PM IST:

ఏపీలో పలుచోట్ల హింస్మాత సంఘటనలు జరిగాయి. ప్రకాశం జిల్లా దర్శిలోని మండల పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోగా.. సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
 
4:09 PM IST:

- అరుకు, రంపచోడవరం, పాడేరు
 
4:17 PM IST:

తెలంగాణ లో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

సిర్పూర్, 
ఆసిఫాబాద్, 
బెల్లంపల్లి, 
చెన్నూరు, 
మంచిర్యాల,
మంథని, 
భూపాలపల్లి, 
ములుగు, 
పినపాక, 
ఇల్లెందు, 
కొత్తగూడెం, 
అశ్వారావుపేట, 
భద్రాచలం నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది.

-- 9,900 సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్

- క్యూలో ఉన్నవారికే అవకాశం

4:01 PM IST:

ఆదిలాబాద్ - 62.44 శాతం, 
భువనగిరి - 62.05 శాతం, 
చేవెళ్ల - 42.35 శాతం, 
హైదరాబాద్‌- 29.47శాతం, 
కరీంనగర్‌ - 58.24 శాతం, 
ఖమ్మం - 63.67 శాతం, 
మహబూబాబాద్ - 61.40 శాతం, 
మహబూబ్‌నగర్‌ - 58.92 శాతం, 
మల్కాజ్‌గిరి - 37.69 శాతం,
మెదక్- 60.94 శాతం, 
నాగర్‌కర్నూల్‌- 57.17 శాతం, 
నల్లగొండ - 59.91 శాతం,
నిజామాబాద్‌లో 58.70 శాతం, 
పెద్దపల్లి- 55.92 శాతం, 
సికింద్రాబాద్‌- 35.48 శాతం, 
వరంగల్‌ - 54.17 శాతం, 
జహీరాబాద్‌ - 63.96 శాతం .
 
3:40 PM IST:

తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోలింగ్ 52.30 శాతం మార్కు దాటింది.ఈ సారి రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వొచ్చనే ఎన్నికల సంఘం అధికారులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్‌లో 63.94 శాతం పోలింగ్ కాగా, మెదక్‌లో 60.94 శాతం, వరంగల్‌లో 54.17 శాతం, ఖమ్మంలో 63.67 శాతం పోలింగ్‌ నమోదు
 
3:32 PM IST:

ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోలింగ్ 52 శాతం మార్కు దాటింది. ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వొచ్చనే ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.

3:23 PM IST:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్

1 గంట వరకు 40.38శాతం పోలింగ్ 

ఆదిలాబాద్ -50.18 శాతం
భువనగిరి -46.49 శాతం
చేవెళ్ల -34.56 శాతం
హైద్రాబాద్ -19.37 శాతం
కరీంనగర్-45.11 శాతం
ఖమ్మం-50.63 శాతం
మహబూబాబాద్-48.81 శాతం
మహబూబ్నగర్-45.84 శాతం
మల్కాజిగిరి-27.69 శాతం
మెదక్-46.72 శాతం
నాగర్ కర్నూల్ -45.88 శాతం
నల్గొండ-48.48 శాతం
నిజామాబాద్-45.67 శాతం
పెద్దపల్లి-44.87 శాతం
సికింద్రబాద్-24.91 శాతం
వరంగల్-41.23 శాతం
జహీరాబాద్-50.71 శాతం
 
2:45 PM IST:

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయ్యింది. పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించినందుకు అతడిపై మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇక హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కూడా మలక్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.
 
2:08 PM IST:

తెలంగాణలో ఒంటిగంట వరకు  40 శాతం పోలింగ్ నమోదయ్యింది. 36 శాతంమంది మహిళలు, 35 శాతం మంది పురుషులు ఓటేసారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 40 శాతం పోలింగ్ నమోదయ్యింది. 
 
12:30 PM IST:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓటేసారు. భార్య కూతురితో కలిసివెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇక ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు.    

12:12 PM IST:

తెలంగాణ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని తన స్వగ్రామంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. చింతమడక పోలింగ్ బూత్ కు భార్య శోభతో కలిసివచ్చి ఓటేసారు కేసీఆర్. అయితే కేసీఆర్ తనయుడు కేటీఆర్ కుటుంబం మాత్రం హైదరాబాద్ లో ఓటేసింది. కేసీఆర్ మనవడు హిమాన్షు మొదటిసారి ఓటేసాడు. 

12:06 PM IST:

హైదరాబాద్ లో సినీప నటులు మంచు లక్ష్మి, మంచు మనోజ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటేయడానికి బద్దకిస్తున్న హైదరాబాదీలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను  ఓటేయడానికే ముంబై నుండి హైదరాబాద్ వచ్చాను... కానీ ఇక్కడే వున్నవారు ఇళ్లలోంచి కూడా బయటకు రాకపోవడం దారుణమని మంచు లక్ష్మి ఆందోళన వ్యక్తం చేసారు.

11:39 AM IST:

తెలంగాణలో ఉదయం 11 గంటల వరకు 24.25 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 24 శాతం పోలింగ్ నమోదయ్యింది. 
 
11:37 AM IST:

మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేటలో హరీష్, హైదరాబాద్ నందినగర్ లో కేటీఆర్ ఓటేసారు. మంత్రి సీతక్క కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు. 
 
11:15 AM IST:

తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.స్థానిక ఎమ్మెల్యే ఓ ఓటర్ పై చేయిచేసుకోగా... ఆ ఓటర్ కూడా ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే అనుచరులంతాసదరు ఓటర్ పై దాడికి దిగారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు. 

11:01 AM IST:

హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

10:47 AM IST:

సినీ హీరో బాలకృష్ణ పోటీచేస్తున్న హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిలమత్తూరు వైసిపి ఎంపిపిపై టిడిపి శ్రేణులు దాడికి దిగాయి. ఈ ఘటనలో పలువురు వైసిపి నేతలు గాయపడగా వాహనాలు ధ్వంసమయ్యాయి.   
 
10:30 AM IST:

 చేవెళ్ల, మల్కాజ్ గిరి బిజెపి అభ్యర్థలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ లు కుటుంబసమేతంగా వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

10:06 AM IST:

హైదరాబాద్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి, కరీంనగర్ లో బిజెపి నేత బండి సంజయ్ కుటుంబసమేతంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

9:38 AM IST:

ఆంధ్ర ప్రదేశ్ లో ఉదయం 9 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదయ్యింది. 

9:37 AM IST:

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభమై రెండు గంటలు గడుస్తున్నా ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదు కాలేదు. ఉదయం 9 గంటల వరకు కేవలం 9.51 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది 

9:12 AM IST:

9:10 AM IST:

భర్త చంద్రబాబుతో కలిసివచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు నారా భువనేశ్వరి.  అనంతరం ఆమె రాష్ట్రంలోని మహిళలంతా ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.  

10:08 AM IST:

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోకి  లక్ష్మీనరసింహ స్వామి కాలనీ పోలింగ్ బూత్ లో ఆయన ఓటేసారు. భార్యతో కలిసివచ్చి ఓటేసారు. 

8:59 AM IST:

నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొండాయపాలెం పోలింగ్ కేంద్రంలో వైసిపి నేత విజయసాయిరెడ్డి ఓటుహక్కను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజాస్వామ్యానికి పండుగ రోజయిన ఇవాళ ప్రజలంతా  ఓటు వేసి మీ బాధ్యతను నిర్వర్తించాలని విజయసాయి కోరారు. 

8:49 AM IST:

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. ఓటు వేసాక మోడీ పేరు ప్రస్తావించడం ద్వారా కిషన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సీఈవోకు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. 
 
8:25 AM IST:

మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో రెంటాల గ్రామంలో పోలింగ్ కాస్త ఆలస్యంగా మొదలయ్యింది. అయితే పోలీసులు భారీగా మొహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

8:22 AM IST:

మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థులు డికె అరుణ, వంశీచంద్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
 
8:28 AM IST:

మెగాస్టార్ చిరంజీవి క్యూలైన్ లో నిలబడి ఓటుహక్కును వినియోగించుకోడానికి ఎదురుచూస్తున్నారు. భార్య సురేఖతో కలిసి ఆయన ఓటు వేసేందుకు వచ్చారు. 

8:10 AM IST:

కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి కాచీగూడలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని కాచిగూడలో దీక్ష మోడల్ స్కూల్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ కు కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

8:16 AM IST:

తెలంగాణ మజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా భార్య భువనేశ్వరితో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని ఓ పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు దంపతులు ఓటేసారు. ఇక మంగళగిరిలో నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఓటేసారు.

8:27 AM IST:

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. తన సొంత జిల్లా కడపలోని పులివెందులలోని బాకరాపురం పోలింగ్ కేంద్రంలో జగన్ ఓటేసారు. ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఓటేసారు. 

8:20 AM IST:

హైదరాబాద్ లోక్ సభ బిజెపి అభ్యర్థి మాధవీ లత ఓటుహక్కును వినియోగించుకున్నారు.

7:31 AM IST:

ఆంధ్ర ప్రదేశ్ తో  పాటు తెలంగాణలోనూ పలు పోలింగ్ కేంద్రాల్లో  ఈవిఎంలు మొరాయిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ పరిధిలోని సీతారామపురంలో ఈవీఎంలు పనిచేయడం లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో కూడా ఈవీఎంల సమస్య బయటపడింది. 

8:30 AM IST:

సినీ నటులు అల్లు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూ. ఎన్టీఆర్ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు తల్లి, భార్యతో కలిసివచ్చారు. పోలింగ్ బూత్ వద్దక్యూలైన్ లో నిలబడి ఓటేసేందుకు ఎదురు చూస్తున్నారు. 

7:15 AM IST: