ఏపీలో కరోనా ఎఫెక్ట్:కొల్లిపరలో రేపటి నుండి లాక్‌డౌన్
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కొల్లిపర మండలంలో ఈ నెల 10వ తేదీ నుండి 16 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు.
గుంటూరు: కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కొల్లిపర మండలంలో ఈ నెల 10వ తేదీ నుండి 16 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు.వారం రోజులపాటు కఠినంగా ఆంక్షలను అమలు చేస్తామని రెవిన్యూ అధికారులు ప్రకటించారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే వ్యాపార సముదాయాలను తెరవాలని తహసీల్దార్ ఆదేశించారు.
టీస్టాల్స్, హోటల్స్ పూర్తిగా మూసివేయాలని ఆయన కోరారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.ఏపీ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గురువారం నాడు ఒక్క రోజే సుమారు 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో వార్గు, గ్రామ సచివాలయాల ద్వారా వ్యాక్సినేషన్ చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన అధికారుల సమావేశంలో వ్యాక్సినేషన్ లో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దిశానిర్ధేశం చేశారు.