Asianet News TeluguAsianet News Telugu

ఊరి కథ-కారంచేడు: దళితవాడపై విరుచుకుపడ్డ కులరక్కసి

అది భూస్వామ్యం ముసుగులో కులాధిపత్యం రక్తపుటేరులు పారించిన ఓ రుధిర క్షేత్రం.. తెలుగు నేలపై సామాజిక ఉద్యమాలకు దళితులు తమ నెత్తుటితో అంకురార్పణ చేసిన ఘట్టానికి సాక్షిభూతం. అణగారిని వర్గాలను కదిలించి.. దళిత శక్తులను ఆత్మగౌరవ పతాక కిందకు తీసుకొచ్చిన ఓ దిక్సూచి కారంచేడు గురించి ఈ వారం వూరి కథలో తెలుసుకుందాం. 

behind the story of karamchedu massacre
Author
Karamchedu, First Published Sep 8, 2019, 2:47 PM IST

అది భూస్వామ్యం ముసుగులో కులాధిపత్యం రక్తపుటేరులు పారించిన ఓ రుధిర క్షేత్రం.. తెలుగు నేలపై సామాజిక ఉద్యమాలకు దళితులు తమ నెత్తుటితో అంకురార్పణ చేసిన ఘట్టానికి సాక్షిభూతం. అణగారిని వర్గాలను కదిలించి.. దళిత శక్తులను ఆత్మగౌరవ పతాక కిందకు తీసుకొచ్చిన ఓ దిక్సూచి కారంచేడు గురించి ఈ వారం వూరి కథలో తెలుసుకుందాం. 

ప్రకాశం జిల్లా చీరాల మండలంలో ఉన్న గ్రామం కారంచేడు.. 1985 జూలై 15 వరకు ఆ వూరు ఆ జిల్లాలోనే సరిగ్గా తెలియదు. కానీ.. ఆ తర్వాతి రోజు నుంచి దేశంలో కారంచేడు పేరు మారుమోగిపోయింది. జూలై 16 ఉదయం దళితుల తాగునీటి చెరువులోకి రాయినీడి శ్రీనివాసరావు పశువులను తోలాడు. దీనిని మున్నంగి సువార్త అనే మాదిగ స్త్రీ ప్రశ్నించింది. 

ఈ క్రమంలో కమ్మ యువకులు ఆమెతో వాగ్వాదానికి దిగడంతో పాటు కులం పేరుతో దూషించారు. దీనిపై ఆగ్రహించిన సువార్త మంచినీటి బిందెతో వారిపై దాడి చేసింది. దళితవాడకే చెందిన కత్తి చంద్రయ్య, మన్నెం సువార్తమ్మ.. శ్రీనివాసరావును వారించే ప్రయత్నం చేశాడు.

వెంటనే ఈ విషయం వూళ్లో తెలియడంతో శ్రీనివాసరావుకు మద్ధతుగా కొందరు కమ్మ పెద్దలు, యువకులు అక్కడికి వచ్చారు.. దళితులు సైతం పెద్ద సంఖ్యలో పొగయ్యారు. పెద్దల జోక్యంతో అప్పటికి వివాదం సద్దుమణిగినప్పటికీ.. ఏదో జరగబోతోందనే భయం దళితులను వెంటాడింది.

ఊహించినట్లుగానే 17వ తేదీ ఉదయం కారంచేడుతో పాటు చుట్టపక్కల ప్రాంతాల్లో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వందలాది మంది.. తెల్లవారుజామున దళితవాడపై విరుచుకుపడ్డారు. బరిసెలు, గొడ్డళ్లు, కత్తులతో రాక్షసంగా, క్రూరాతి క్రూరంగా దళిత యువకులను వేటాడారు, స్త్రీలపై అత్యాచారాలు చేశారు. 

అక్కడితో ఆగకుండా గాయపడ్డ మహిళలను ఒక్కచోటికి చేర్చి తగులబెట్టేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో తేళ్ల మోషే, తేళ్ల ముత్తయ్య, తేళ్ల యెహోషువా, దుడ్డు వందనం, దుడ్డు రమేశ్, దుడ్డు అబ్రహాంలు మరణించగా.. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ మారణకాండతో భయాందోళనలకు గురైన దళితులు కారంచేడు వదిలి.. చీరాలకు పారిపోయారు. అటు ఈ సంగటనై రాష్ట్రం, దేశం ఉలిక్కిపడ్డాయి. దళిత, సామాజిక, ప్రగతిశీల సంఘాలు బాధితులకు అండగా నిలిచాయి. 

నెలాఖరులో కారంచేడు బాధితుల ఐక్య కార్యచరణ కమిటీ ఏర్పడి.. న్యాయ పోరాటం చేసింది. బాధితులకు భూమి, నివాసం ఏర్పాటు చేయాలనే 28 డిమాండ్లతో కత్తి పద్మారావు, సలగల రాజశేఖర్, బొజ్జా తారకం వంటి వారు ఉద్యమించారు.

దీంతో దిగివచ్చిన ప్రభుత్వం.. బాధితులకు పునరావాస కాలనీ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో పాటు పనులను పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారిన శంకరన్‌ను నియమించింది. 

ఆయన పొలాలు, స్థలాలు, పక్కా ఇల్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి పనులు, స్వయం శిక్షణ ఇలా అనే మార్గాల్లో బాధితులకు అండగా నిలిచారు. మరోవైపు సుధీర్ఘ విచారణ అనంతరం 24 ఏళ్ల తర్వాత దోషులకు శిక్షలు పడ్డాయి. దాదికి ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న నాటి సీఎం ఎన్టీఆర్ వియ్యంకుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి చెంచురామయ్యను నక్సల్స్ కాల్చి చంపారు. 

2008లో ఈ కేసులో సుప్రీం జోక్యం చేసుకోవడంతో విచారణ వేగంగా సాగింది. తుది తీర్పు వెలువడే నాటికి దోషుల్లో చాలామంది చనిపోయారు. చివరికి నిందితుల్లో ఒకరికి జీవితఖైదు, 29 మందికి మూడేళ్ల శిక్ష పడింది. మరోవైపు కారంచేడు ఘటనకు సాక్షిగా ఉన్న అలీసమ్మ హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. 

అయితే ఈ మారణహోమం తర్వాత దళితులు తమ అస్థిత్వం కోసం, హక్కుల కోసం, ఆత్మరక్షణ కోసం పిడికిలి బిగించారు. 1989లో వచ్చిన ఎస్‌సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు దేశవ్యాప్తంగా సాగిన పలు దళిత ఉద్యమాలకు కారంచేడు ఘటనే స్పూర్తి. 

దళితుల సమస్యలన్నింటికి పరిష్కారం రాజ్యాధికారమే అన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నినాదాన్ని దళితుల మెదళ్లలో నింపింది. దళిత కులాల సమస్యలను సమాజంలో, ప్రభుత్వంలో చర్చకు పెట్టింది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని బతికిన దళితుల్లో కారంచేడు ఘటన తర్వాత ఊహించలేనంతటి మార్పు వచ్చింది.

ఊరి కథ: మంగళగిరి

Follow Us:
Download App:
  • android
  • ios