Face Glow: ఈ జ్యూస్ లు తాగితే ముఖంపై ముడతలే రావు..!

Published : Mar 25, 2026, 01:33 PM IST
What can you Drink to reduce wrinkles and make your skin glow

సారాంశం

Face Glow: మెరిసే చర్మం, ముఖంపై ముడతలు లేకుండా అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అందుకోసం ఖరీదైన క్రీములతో పని లేదు. కేవలం కొన్ని రకాల ఆహారాలను డైట్ లో భాగం చేసుకుంటే చాలు. 

 

అందం అనేది పైన పూసే క్రీముల్లో లేదు, మనం తీసుకునే ఆహారంలో ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు రావడం, చర్మం రంగు తగ్గడం వంటి సమస్యలు అందరినీ వేధిస్తుంటాయి. అయితే, ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ అవసరం లేకుండానే.. ఇంట్లోనే దొరికే పండ్లు, కూరగాయల రసాలతో మీ చర్మాన్ని అద్దంలా మెరిపించవచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఈ 6 రకాల జ్యూస్‌లు మీ చర్మంపై ముడతలను తగ్గించి, సహజమైన గ్లోను ఎలా ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వయసు పెరిగినా, మీ అందాన్ని పెంచే కొన్ని రకాల జ్యూస్ లు ఇవి..

1. ఏబీసీ జ్యూస్ (ABC Juice - Apple, Beetroot, Carrot)

దీనిని 'మిరాకిల్ డ్రింక్' అని పిలుస్తారు. ఇది చర్మాన్ని డిటాక్స్ చేయడంలో నంబర్ 1.

ప్రయోజనం: యాపిల్ చర్మానికి తేమను ఇస్తుంది, బీట్రూట్ రక్తాన్ని శుద్ధి చేసి సహజమైన మెరుపును ఇస్తుంది, క్యారెట్ ముడతలను తగ్గిస్తుంది.

చిట్కా: ఉదయం పరగడుపున తాగితే ఫలితం అద్భుతంగా ఉంటుంది.

2. దానిమ్మ జ్యూస్ (Pomegranate Juice)

ప్రయోజనం: దీనిలో ఉండే 'ప్యూనికాలాజిన్స్' (Punicalagins) చర్మ కణాలను పునరుజ్జీవింపజేస్తాయి. సూర్యరశ్మి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి, వృద్ధాప్య ఛాయలు (Anti-aging) రాకుండా చూస్తుంది.

3. ఆరెంజ్ జ్యూస్ (Orange Juice)

ప్రయోజనం: విటమిన్-సి పుష్కలంగా ఉండటం వల్ల కొల్లాజెన్ (Collagen) ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల చర్మం బిగుతుగా మారి, ముడతలు తగ్గుతాయి. చర్మం రంగు మెరుగుపడటానికి ఇది చాలా కీలకం.

4. బొప్పాయి జ్యూస్ (Papaya Juice)

ప్రయోజనం: ఇందులో 'పాపైన్' (Papain) అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మంపై ఉండే మృతకణాలను తొలగించి, ముఖంపై మచ్చలను తగ్గిస్తుంది. ముఖానికి గ్లో ఇవ్వడంలో ఇది దిట్ట.

5. క్యారెట్ , బీట్రూట్ జ్యూస్ (Carrot & Beetroot)

ప్రయోజనం: క్యారెట్‌లోని బీటా-కెరోటిన్ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. బీట్రూట్‌లోని ఐరన్ , పొటాషియం ముఖంపై మొటిమల మచ్చలను తగ్గించడానికి సహాయపడతాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gold Bracelets: ట్రెండీ డిజైన్‍లో కఫ్ బ్రేస్‌లెట్స్.. చూడకపోతే ఎలా?
Gold Chain: 8 గ్రాముల్లో అదిరిపోయే చైన్ డిజైన్లు.. చూస్తే ఫిదా అవుతారు