Period Pain: పీరియడ్స్ లో నొప్పిని లైట్ తీసుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే

Published : Mar 12, 2026, 09:27 AM IST
When Period Pain Is A Serious Health Warning Sign

సారాంశం

Period Pain: పీరియడ్స్ టైంలో నొప్పి రావడం కామనే. కానీ, ఆ నొప్పి భరించలేనంతగా ఉండి, రోజువారీ పనులకు అడ్డంకిగా మారితే మాత్రం దాన్ని సాధారణంగా తీసుకోకూడదని లైఫ్‌స్టైల్ నిపుణుడు ల్యూక్ కౌటిన్హో హెచ్చరిస్తున్నారు.

ప్రతి నెలా మహిళలకు పీరియడ్స్ రావడం సహజం. ఈ సమయంలో కడుపునొప్పి, రొమ్ముల్లో నొప్పి, నడుం నొప్పి, వాంతులు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. పీరియడ్స్ రక్తాన్ని బయటకు పంపడానికి గర్భాశయంలోని కండరాలు సంకోచించడం వల్లే ఈ నొప్పి వస్తుంది. రక్తంతో పాటు గర్భాశయం లోపలి పొర కూడా బయటకు వెళ్తుంది కాబట్టి, ఈ క్రమంలో శరీరంలో జరిగే మార్పులు కూడా నొప్పికి కారణమవుతాయి.

పీరియడ్స్ నొప్పిని చాలామంది సాధారణ విషయంగా చూస్తారు. కానీ, ఆ నొప్పి మన రోజువారీ పనులను కూడా చేసుకోలేనంత తీవ్రంగా ఉంటే, దాన్ని అస్సలు తేలిగ్గా తీసుకోవద్దని లైఫ్‌స్టైల్ నిపుణుడు ల్యూక్ కౌటిన్హో అంటున్నారు. ఇలాంటి తీవ్రమైన, ఆగకుండా వచ్చే నొప్పి 'సెకండరీ డిస్మెనోరియా' అనే తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.

పీరియడ్ నొప్పిలో రకాలు…

పీరియడ్స్ నొప్పిలో సాధారణంగా రెండు రకాలుంటాయి. చాలామందిలో కనిపించే సాధారణ నొప్పిని 'ప్రైమరీ డిస్మెనోరియా' అంటారు. మందులు, జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించుకోవచ్చు. గర్భాశయంలో సంకోచాలకు కారణమయ్యే 'ప్రోస్టాగ్లాండిన్స్' అనే రసాయనాల వల్ల ఈ నొప్పి వస్తుంది.

ప్రైమరీ డిస్మెనోరియాకు భిన్నంగా, 'సెకండరీ డిస్మెనోరియా' వేరే ఆరోగ్య సమస్యల వల్ల వస్తుంది. ఇది సాధారణంగా తీవ్రంగా ఉండి, కాలం గడిచేకొద్దీ నొప్పి మరింత ఎక్కువవుతుంది. దీని లక్షణాల్లో అధిక రక్తస్రావం, తీవ్రమైన నీరసం, పీరియడ్స్ లేనప్పుడు కూడా కటి ప్రాంతంలో (పెల్విక్ ఏరియా) నొప్పి, మలవిసర్జన లేదా భర్త తో కలయిక సమయంలో ఇబ్బంది వంటివి ఉంటాయి.

దీనికి ఒక ముఖ్య కారణం 'ఎండోమెట్రియోసిస్'. ఈ సమస్య ఉన్నవారిలో గర్భాశయం లోపలి పొర లాంటి కణజాలం గర్భాశయం బయట పెరుగుతుంది. టీనేజర్లలో సెకండరీ డిస్మెనోరియాకు ఇది ఒక ప్రధాన కారణం. పునరుత్పత్తి వయసులో ఉన్న మహిళల్లో దాదాపు 10% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక కటి నొప్పితో బాధపడే పిల్లలలో 30% నుంచి 70% మందికి ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

మరో కారణం 'గర్భాశయ ఫైబ్రాయిడ్లు'. ఇవి గర్భాశయంలో ఏర్పడే క్యాన్సర్ కాని గడ్డలు. పునరుత్పత్తి వయసులో ఉన్న భారతీయ మహిళల్లో 20% నుంచి 40% మందిలో ఈ ఫైబ్రాయిడ్లు కనిపిస్తాయి.

పెరుగుతున్న కాలుష్యం, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి, పెరుగుతున్న ఊబకాయం వంటివి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తున్నాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఇలాంటి సమస్యలకు ఒక కారణం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Trendy Bangles: అదిరిపోయే డిజైన్‍లో లక్క గాజులు.. ట్రై చేయకపోతే ఎలా?
Blouse Designs: సమ్మర్ పార్టీల కోసం అదిరిపోయే డిజైన్‍లో బ్లౌజ్‍లు..