ముఖంపై మొటిమలు, మచ్చలు పోవాలంటే ఉల్లిపాయను ఇలా పెట్టండి

By Shivaleela RajamoniFirst Published Aug 27, 2024, 4:14 PM IST
Highlights

ఉల్లిపాయ ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. అవును ఉల్లిపాయను ఉపయోగించి మీరు మొటిమలను, మచ్చలను వంటి ఎన్నో స్కిన్ సమస్యలను తగ్గించుకోవచ్చు. 
 


మనలో చాలా మందికి ముఖానికి తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు, మొటిమలు వంటి ఎన్నో ఉంటాయి. ఇవి చిరాకు కలిగించడమే కాకుండా.. మన ముఖ అందాన్ని కూడా తగ్గిస్తాయి. ఈ సమస్యలను మేకప్ తో కూడా కవర్ చేయలేం. అందుకే వీటిని శాశ్వతంగా తొలగించే మార్గాన్నే ఫాలో కావాలి. కానీ ఇలా పోగొట్టడం ఇంపాజిబుల్ అని చాలా మంది అనుకుంటారు. కానీ ఒక చిన్న ఉల్లిపాయతో మీరు ముఖంపై మొటిమలను, మచ్చలను చాలా ఈజీగా పోగొట్టొచ్చు. అదెలాగో ఓ లుక్కేద్దాం పదండి. 

మొటిమలను, మచ్చలను, ఇతర చర్మ సమస్యలను పోగొట్టడానికి మీరు ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకోండి. దీన్ని సన్నగా తరిగి గ్రైండ్ చేసి జ్యూస్ గా చేయండి. కానీ దీనిలో వాటర్ మాత్రం పోయకండి. ఈ ఉల్లిపాయ రసాన్ని మొటిమలు, మచ్చలకు అప్లై చేసి కాసేపు  సున్నితంగా  మసాజ్ చేయండి.

Latest Videos

ఉల్లిపాయ రసాన్ని ముఖానికి బాగా పట్టించి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేస్తే సరిపోతుంది. ఇలా కంటిన్యూగా కొన్ని వారాల పాటు చేస్తే ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు ఈజీగా మటుమాయం అయిపోతాయి. 

ఉల్లిపాయ ప్రయోజనాలు: ఉల్లిపాయలు మన ఆరోగ్యానికే కాకుండా.. మన చర్మానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఉల్లిపాయల్లో ఉండే కెంప్ఫెరోల్, సెఫాలిన్ వంటి బయో ఫ్లెవనాయిడ్లు మొటిమలను,  మచ్చలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

click me!