మీ కిచెన్ లోని ఈ ఐదు వాడితే... మేకప్ అవసరం లేదు..!

By ramya Sridhar  |  First Published Aug 27, 2024, 10:10 AM IST

మన కిచెన్ లో లభించే కేవలం ఐదు ఆహారాలను రోజూ మన డైట్ లో తీసుకుంటే... సహజంగా, ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్,  మేకప్ లు వాడాల్సిన అవసరం లేదట.


మనం ఏం తింటామో.. అదే బయటకు కనపడుతుంది. అంటే.. మనం ఎంత మంచి ఆహారం తీసుకుంటే.. అంత యవ్వనంగా, అందంగా కనపడతాం. ముఖ్యంగా.. నిత్యం మన కిచెన్ లో లభించే కేవలం ఐదు ఆహారాలను రోజూ మన డైట్ లో తీసుకుంటే... సహజంగా, ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్,  మేకప్ లు వాడాల్సిన అవసరం లేదట. మరి ఏ ఆహారాలు తీసుకుంటే మనం అందంగా మెరిసిపోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం...

పోషకాహారం చర్మం ఆరోగ్యంతో ముడిపడి ఉంటుందట. వృద్ధాప్యం బారినపడకుండా ఉండేందుకు , ఎక్కువ కాలం యవ్వనంగా కనపడటానికి సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. చర్మం తాజాగా కనపడటానికి హెల్ప్ చేస్తుంది. మరి.. ఏం తింటే.. మనం ఎక్కువ కాలం యవ్వనంగా కనపడేలా సహాయం చేస్తుందో చూద్దాం..

Latest Videos

1.టమాటాలు.. టమాటాల్లో లైకోపీన్ ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్ యాక్సిడెంట్ గా పని చేస్తుంది. పూర్తి గా ఉడికించిన టమాటల్లో యాంటీ ఏజెంగ్ యాక్సిడెంట్  మరింత ఎక్కువగా ఉంటుంది.  అందుకే.. రెగ్యులర్ గా టమాటలను డైట్ లో భాగం చేసుకుంటే అందం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. టమాటలు మాత్రమే కాదు.. క్యారెట్లు, పుచ్చకాయలు, బొప్పాయి డైట్ లో భాగం చేసుకుంటే సరిపోతుంది.

2.ఓట్స్... ఓట్స్ లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మొటిమల సమస్యతో బాధపడేవారు.. ఓట్స్ ని బ్రేక్ ఫాస్ట్ గా ఎంచుకుంటే సరిపోతుంది. మీరు మీ వోట్స్‌లో ఎక్కువ చక్కెరను జోడించకుండా చూసుకోండి ఎందుకంటే ఇది మీ మొటిమలను తీవ్రతరం చేస్తుంది. షుగర్ లేకుండా తీసుకుంటే... ఓట్స్ మీకు మంచి అందాన్ని ఇచ్చే ఫుడ్ అవుతుంది. 

3. వేరుశెనగలు .. వేరు శెనగలు లైసిన్‌తో నిండి ఉంటాయి. ఇది కొల్లాజెన్‌ను నిర్మించడంలో సహాయపడే అమైనో ఆమ్లాలు ఇందులో ఉంటాయి. ఇవి చర్మాన్ని అందంగా మార్చడానికి సహాయపడతాయి.

4.పాలకూర.. ఆకుకూరలు సహజంగానే మనకు అందాన్ని తీసుకువస్తాయి. ముఖ్యంగా పాలకూర.. మనల్ని యవ్వనంగా కనిపించేలా చేయడంతో పాటు..మొటిమలు, వాటి తాలుకా మచ్చలు కూడా రాకుండా చేస్తాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటితో పాటు బ్రోకలీ, బఠానీలు కూడా తినొచ్చు.

5. మంచి చర్మ ఆరోగ్యం కోసం పసుపు ను మీ ఆహారంలో చేర్చుకోండి. పసుపులో కర్కుమిన్ ఉంది, ఇది మీ చర్మాన్ని తీవ్రంగా మొద్దుబారించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఈ ఫ్రీరాడికల్స్ తో పోరాడటం వల్ల.. ఎక్కువ కాలం చర్మం యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది.
 

click me!