పాదాల పగుళ్లు ఇబ్బంది పెడుతున్నాయా..? ఇదిగో పరిష్కారం..!

By telugu news teamFirst Published Mar 16, 2023, 1:59 PM IST
Highlights

ఇంట్లోనే పాదాలకు పెడిక్యూర్ చేసుకోవచ్చు. పెడిక్యూర్ చేయడం వల్ల పాదాలు పగలకుండా ఉంటాయి. ఒక వేళ పగిలినా డెడ్ స్కిన్ మొత్తం తొలగిపోతుంది.
 


చాలా మందికి సమ్మర్ వస్తే చాలు పాదాళ్లు ఎక్కువగా పగుళుతూ ఉంటాయి. పాదాలు పగళ్లు చాలా ఇబ్బంది పెడతాయి. కాళ్లు విపరీతంగా నొప్పి పెడతాయి. అయితే... ఈ పాదాలు పగలకుండా ఉండాలంటే  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి చూద్దాం..

1.కాళ్లకు ప్రతిరోజూ కాటన్ సాక్స్ ధరించండి. రాత్రి పడుకునే ముందు కాళ్లకు సాక్సులు ధరించడం వల్ల  పాదాలకు ఉన్న మాయిశ్చరైజర్ పోదు. అలానే ఉంటుంది.

2.పాదాల పగుళ్లు తగ్గాలంటే... తరచుగా స్క్రబ్ చేస్తూ ఉండాలి. పాదాలను స్క్రబ్ చేస్తూ ఉండటం వల్ల.. డ్రై అవ్వకుండా హైడ్రేటెడ్ గా ఉంటాయి.

3.మార్కెట్లో  పాదాలకు కూడా పీల్ మాస్క్ లు అందుబాటులో ఉంటాయి. ఆ పీల్ మాస్క్ లను ఉపయోగించడం వల్ల కూడా.. పాదాలపై ఉన్న ముదురు చర్మాన్ని తొలగించవచ్చు.

4.పార్లర్ కి వెళ్లి పెడిక్యూర్  చేసుకోవచ్చు. లేదంటే... ఇంట్లోనే పాదాలకు పెడిక్యూర్ చేసుకోవచ్చు. పెడిక్యూర్ చేయడం వల్ల పాదాలు పగలకుండా ఉంటాయి. ఒక వేళ పగిలినా డెడ్ స్కిన్ మొత్తం తొలగిపోతుంది.

5.ప్రత్యేకంగా పాదాలకు కూడా వ్యాక్స్ చేస్తారు. తరచూ దీనిని చేయించుకోవడం వల్ల కూడా... రక్త  ప్రసరణ బాగా జరుగుతుంది. పగుళ్లు రాకుండా ఉంటాయి.

6.గోరు వెచ్చని నీటిలోకొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. ఆ తర్వాత పాదాలను ఆ నీటిలో నానపెట్టాలి. ఆ తర్వాత పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే ఫలితం మీరే చూస్తారు.

7.పాదాలను మృదువుగా మార్చుకునేందుకు తరచూ పాదాలకు మాయిశ్చరైజర్  రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పాదాలు మృదువుగా ఉంటాయి.

8.పాదాలకు తరచూ వ్యాజిలైన్ రాస్తూ ఉండటం వల్ల మృదువుగా ఉంటాయి. ఒకవేళ పగుళ్లు వచ్చినా.. తగ్గిపోతాయి.

9.పాదాలకు తరచుగా వెజిటేబుల్ ఆయిల్ రాస్తూ ఉండటం వల్ల కూడా... పాదాలు మృదువుగా ఉంటాయి.
 

click me!