బాలీవుడ్ అందాలను తలదన్నేలా అందం ఆమె సొంతం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మీరా తరచుగా షాహిద్ కపూర్‌తో కనిపిస్తుంటుంది.
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ తెలియని వారుండరు. తన అందచందాలతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టారు. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో ఆమె ఆకట్టుకుంటూ ఉంటారు. మీరా రాజ్‌పుత్ బాలీవుడ్‌లో కనిపించకపోయినా, బాలీవుడ్ అందాలను తలదన్నేలా అందం ఆమె సొంతం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మీరా తరచుగా షాహిద్ కపూర్‌తో కనిపిస్తుంటుంది.
ఇద్దరు పిల్లల తల్లి అయిన మీరా బ్యూటీ, ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకంుటారు. మీరా ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. మీరా అందం సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
undefined
తేనె, పసుపు ఫేస్ ప్యాక్: మీరా తేనె , పసుపు కలిపిన ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండు మూడు సార్లు అప్లై చేస్తుంది. ఒక చెంచా తేనెలో చిటికెడు పసుపు కలిపితే ఫేస్ ప్యాక్ తయారవుతుంది. ఈ ఫేస్ ఫేక్ తక్షణమే ముఖాన్ని కాంతివంతం చేస్తుంది.
పెరుగు , శెనగ పిండి ఫేస్ ప్యాక్: మీరా రాజ్‌పుత్ వారానికి ఒకసారి పెరుగు, శెనగ పిండి ఫేస్ ప్యాక్‌ను అప్లై చేస్తారు. ఇది వారి ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. వారి చర్మాన్ని దృఢంగా చేస్తుంది. ముడతలను నివారిస్తుంది.
తులసి నీరు: తులసి ఆకులను నీటిలో వేసి ఆ నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది మొటిమల నుండి ముఖాన్ని రక్షిస్తుంది.
జుట్టు సంరక్షణ: మీరా రాజ్‌పుత్ తన జుట్టుతో పాటు తన చర్మాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇంట్లోనే హెయిర్ హెల్త్ ఆయిల్ తయారు చేసుకోండి. కొబ్బరి నూనెలో మెంతి గింజలు, కరివేపాకు, జీడిపప్పు, బ్రహ్మి , వేప పొడి , మందార పువ్వులు వేసి నూనె తయారు చేస్తారు. దీన్ని జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి.
పచ్చి పాలను ఉపయోగించడం : మీరా రాజ్‌పుత్ పచ్చి పాలను తన చర్మంపై టోనర్‌గా పూస్తుంది. పచ్చి పాలలో దూదిని ముంచి ముఖానికి పట్టించాలి.
ఆరెంజ్ పీల్ ప్యాక్: మీరా రాజ్‌పుత్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఆరెంజ్ పీల్ ప్యాక్‌ని ఉపయోగిస్తుంది.
నిమ్మకాయలో అందం: మీరా రాజ్‌పుత్ తన వయస్సును దాచడానికి నిమ్మకాయను ఉపయోగిస్తుంది. నిమ్మకాయతో ముఖానికి మసాజ్ చేస్తారు. నిమ్మకాయను కోసి తేలికగా రుద్దాలి.
ముల్తానీ మిట్టి : ముల్తానీ మిట్టి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీరా రాజ్‌పుత్ అందాల రహస్యంలో ముల్తానీ మిట్టి కూడా దాగి ఉంది. ఆమె ముఖంపై నూనెను నియంత్రించడానికి వారానికి ఒకసారి ముల్తానీ మిట్టిని అప్లై చేస్తుంది. బొప్పాయి పండును మెత్తగా చేసి అందులో పచ్చి పాలు కలిపి పేస్ట్ లా చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి.
ఈ టిప్స్ మీరు కూడా ఫాలో అయితే.... అందంగా మెరిసిపోవచ్చు.