
Face Glow: అందంగా కనిపించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దాని కోసమే మార్కెట్లో దొరికే ప్రతి క్రీమ్, సీరమ్స్ లాంటివి వాడేవారు చాలా మంది ఉన్నారు. కానీ, కెమికల్స్ ఉండే క్రీములు, ఆయిల్స్ వాడటం వల్ల అందం పెరగడం పక్కన పెడితే.. డ్యామేజ్ ఎక్కువ అవుతోంది.అలా అని రెగ్యులర్ గా బ్యూటీ పార్లర్ కి వెళ్దామంటే.. చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలా కాకుండా.. మన ఇంట్లోనే లభించే కొన్ని ఉత్పత్తులను వాడటం వల్ల సహజంగానే అందంగా మెరిసిపోవచ్చు. మరి, అదెలాగో తెలుసుకుందాం...
మనం మన స్కిన్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా.. ముఖం, మెడ,మోచేతులు, మోకాళ్లు లాంటి ప్రదేశాల్లో నల్ల మచ్చలు కనిపిస్తుంటాయి. ఈ నల్ల మచ్చలు మన ముఖ అందాన్ని మరింత ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఆ మచ్చలను కొన్నింటిని రాయడం వల్ల ఈజీగా తొలగించవచ్చు. అది కూడా అత్యంత తక్కువ ఖర్చుతో..
ఆవు నెయ్యి,చిటికెడు పసుపు, రోజ్ వాటర్, నీరు.. వాడితే చాలు మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ఈ పదార్థాలను కలిపి పేస్ట్ లా తయారుచేసి.. మీ ముఖం, మోచేతులు, మోకాళ్లు వంటి ప్రదేశాలలో మృదువుగా అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా ఐదు రోజులు చేస్తే, నల్లటి మచ్చలు తగ్గి చర్మం స్వచ్ఛంగా, ప్రకాశవంతంగా మారుతుంది.
రోజ్ వాటర్ చర్మానికి సహజమైన టోనర్. ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండటంతో చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గిపోతాయి. ఇది ముఖానికి తాజాదనం, మెరుపును అందిస్తుంది. ప్రతిరోజూ దీనిని ఫేస్ ప్యాక్‌లో కలిపి ఉపయోగించడం వల్ల మీరు చర్మం అందంగా కనపడుతుంది.
పసుపులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇది చర్మంపై మచ్చలు, మొటిమలు, ముదురు రంగు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫేస్ లో గ్లో తీసుకువస్తుంది.
కావలసిన పదార్థాలు:
పసుపు – 2 టీస్పూన్లు,నారింజ తొక్క – 1,బంగాళాదుంప – 1/2 ముక్క,కాఫీ – 1 టీస్పూన్, నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు,తేనె – 2 టేబుల్ స్పూన్లు
ఈ పదార్థాలన్నీ మిక్సర్‌లో వేసి పేస్ట్ లా చేయాలి. ముఖంపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత నీటితో కడగాలి.దీనిని రెగ్యులర్ గా ముఖానికి రాయడం వల్ల మీ ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
ఇతర బ్యూటీ రెమడీస్
1. పసుపు – కాఫీ – శనగపిండి మిశ్రమం
ఈ మిశ్రమం చర్మంపై మృత కణాలను తొలగిస్తుంది. స్క్రబ్‌లా పనిచేస్తుంది.
2. బియ్యం పిండి – కలబంద జెల్ – పసుపు
ఈ పేస్ట్ చర్మాన్ని మృదువుగా, నాజూకుగా చేస్తుంది. యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది.
3. ముల్తాని మట్టి – పాలు – పసుపు
ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని పొడిబారకుండా ఉంచుతుంది. వారానికి రెండుసార్లు వాడితే చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది.
ఫైనల్ గా.. అందం కోసం ఖరీదైన ఉత్పత్తులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో లభించే సహజ పదార్థాలతో మీ ముఖం, శరీరాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచవచ్చు. ఈ హోమ్ రెమడీస్‌ను శ్రద్ధగా, క్రమం తప్పకుండా పాటిస్తే మీ ముఖంపై కనిపించే మార్పు అసాధారణంగా ఉంటుంది. సహజమైనవి కావడంతో ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.