
రేఖ హెయిర్ కేర్ టిప్స్: బాలీవుడ్ నటి రేఖ అందం, నటనకు ప్రసిద్ధి. 70 ఏళ్ళ వయసులో కూడా ఆమె జుట్టు ఒత్తుగా, నల్లగా, మెరుస్తూ ఉంటుంది. ఈ వయసులోనూ ఆమె జుట్టు అంత ఒత్తుగా, అందంగా కనిపించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
రేఖ ఖరీదైన ప్రొడక్ట్స్ వాడరని, ఇంట్లోనే హెయిర్ మాస్క్ తయారు చేసుకుంటారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జుట్టు ఆరోగ్యంగా, అందంగా కనిపించడం కోసం ఈ సింపుల్ టిప్స్ పాటిస్తారు.
గుడ్డు, పెరుగు, తేనె కలిపి హెయిర్ మాస్క్ తయారుచేసుకుంటారు. ఇది జుట్టుకు పోషణనిచ్చి, ఒత్తుగా, నల్లగా, మెరిసేలా చేస్తుంది.
ఈ హెయిర్ మాస్క్ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. గుడ్డులోని ప్రోటీన్ జుట్టుకు బలాన్నిస్తుంది. పెరుగు కండిషనర్ లా పనిచేస్తుంది. తేనె జుట్టుకు తేమను అందిస్తుంది. వారానికి ఒకసారి కొబ్బరి నూనెతో జుట్టుకు మసాజ్ చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.