నీతా అంబానీ హ్యాండ్ బ్యాగ్ ధరెంతో తెలుసా?

By telugu news team  |  First Published Jun 20, 2023, 2:15 PM IST

, నీతా హై ప్రొఫైల్ వెడ్డింగ్‌లో తాను ధరించిన పచ్చలు పొదిగిన చీర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీర అని పేర్కొంటూ వార్తల్లో నిలిచింది. 



ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ముఖేష్ అంబానీ ఒకరు. ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కి సంబంధించి  ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె ఫ్యాషన్ విషయంలో ఎప్పుడూ ముందుంటుంది.  ఆమె డ్రెస్ అయినా, షూస్ అయినా, బ్యాగ్ అయినా... నీతా అంబానీ స్టైల్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తన ప్రత్యేకమైన స్టైల్ స్టేట్ మెంట్ తో చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది.

ఆమె ధరించే ఖరీదైన బట్టల నుంచి నగల వరకు ఆమె స్టైల్ స్టేట్ మెంట్ ఫ్యాషన్ ప్రియులను ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల, నీతా హై ప్రొఫైల్ వెడ్డింగ్‌లో తాను ధరించిన పచ్చలు పొదిగిన చీర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీర అని పేర్కొంటూ వార్తల్లో నిలిచింది. 

Latest Videos

undefined

నీతా ఖరీదైన డిజైనర్ దుస్తులు ధరిస్తూ ఉంటుంది. 2015లో మాజీ రాజ్యసభ ఎంపీ పరిమణ నత్వానీ కుమారుడి వివాహ వేడుకలో ఆమె పచ్చలు, ఇతర రాళ్లతో నిండిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గులాబీ రంగు చీరను ధరించింది. పింక్ చీర నిజమైన ముత్యాలు, పచ్చలు, కెంపులు , ఇతర రత్నాలతో చేతితో ఎంబ్రాయిడరీ చేయబడింది. ఈ చీరలో కళ్లు చెదిరే ఫీచర్ బ్లౌజ్ ఆమె ధరించారు.అందులో  కృష్ణుడి బొమ్మను రూపొందించారు. శివలింగం రూపొందించిన ఈ ఖరీదైన చీరను కాంచీపురంలోని 35 మంది మహిళా కళాకారులు రూపొందించారు. దీని ధర 40 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.

ఇప్పుడు కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నీతా అంబానీ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మూడో రోజు ఈవెంట్‌లో నీతా అంబానీ కాఫీ టేబుల్ బుక్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్ కోసం, నీతా అంబానీ ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేసిన డ్రెస్ ధరించారు. అయితే, ఈ సారి ఆమె తన డ్రెస్ తో కాదు, ఆమె హ్యాండ్ బ్యాగ్  హాట్ టాపిక్ గా మారడం విశేషం.

అవును. నీతా చేతిలో ఉంచుకున్న వ్యానిటీ బ్యాగ్ ధర ఎంతో తెలుసా? దీనితో పెద్ద బంగ్లా కొనుక్కోవచ్చు! అవును. నీతా చేతిలో ఉన్న వ్యానిటీ బ్యాగ్ ధర 3.2 కోట్ల రూపాయలు! నీతా వద్ద ఉన్న అరుదైన నైజ్ ఫౌబర్గ్ బిర్కిన్ 20 వైట్ మ్యాట్ ఎలిగేటర్ హ్యాండ్‌బ్యాగ్‌ అది.  దీని ధర 4 లక్షల డాలర్లు అంటే 3.2 కోట్ల రూపాయలు. దానిని ఆమె గత సంవత్సరం కొనుగోలు చేశారట.
 

click me!