బయటకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా ఎస్పీఎఫ్ సన్ స్క్రీన్ లోషన్ రాయాలని చర్మ సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ సన్ స్క్రీన్ లోషన్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఓసారి చూద్దాం..
చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే సన్ స్క్రీన్ లోషన్ వాడటం తప్పనిసరి. ముఖ్యంగా ఈ ఎండాకాలం సన్ స్క్రీన్ లోషన్ రాయకుండా బయటకు వెళితే స్కిన్ డ్యామేజ్ అవ్వడం ఖాయం. అందుకే బయటకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా ఎస్పీఎఫ్ సన్ స్క్రీన్ లోషన్ రాయాలని చర్మ సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ సన్ స్క్రీన్ లోషన్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఓసారి చూద్దాం..
సన్ స్క్రీన్ లోషన్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
1.పావు కప్పు కొబ్బరి నూనె
2.పావు కప్పు షీ బట్టర్
3. రెండు టేబుల్ స్పూన్ల జింక్ ఆక్సైడ్ పౌడర్
4. ఒక టేబుల్ స్పూన్ బేస్ వ్యాక్స్
5. ఐదు చుక్కల ఎసెన్షనల్ ఆయిల్
undefined
తయారు చేయు విధానం..
ఓ గిన్నెలో కొబ్బరి నూనె తీసుకోవాలి. ఒక వేళ గడ్డికట్టి ఉంటే దానిని కరగపెట్టాలి. దీనిలో షీబటర్ తో పాటు, బేస్ వ్యాక్స్ వేసి బాగా కలపాలి. ముందుగా పొయ్యి మీద ఓ గిన్నె ఉంచి నీరు మరగనివ్వాలి. ఆ నీటిలో ఈ మిశ్రమం ఉంచిన గిన్నె ఉంచి, పదార్థాలన్నీ కరిగేవరకు ఆగాలి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత దానిని చల్లారనివ్వాలి. ఇప్పుడు దీనిలో జింక్ ఆక్సైడ్ పౌడర్ వేయాలి. తర్వాత దీనిని బాగా కలపాలి.బాగా కలిసిన తర్వాత అందులో మీకు నచ్చిన ఏదైనా ఎసెన్షన్ ఆయిల్ వేయాలి. ఇది మంచి సువాసన ఇస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని క్లీన్ గా ఉన్న కంటైనర్ లో కి మార్చుకోవాలి. అంతే.. సన్ స్క్రీన్ లోషన్ తయారైనట్లే.
అంతే, దీనిని తరచూ మీ ముఖం, చర్మానికి ఉపయోగించడం మొదలుపెడితే సరిపోతుంది. ఇది మీ చర్మాన్ని సూర్య రశ్మి నుంచి రక్షిస్తుంది.