ఇలా చేస్తే.. పాలు అస్సలు పొంగవు

By Shivaleela RajamoniFirst Published Oct 1, 2024, 5:30 PM IST
Highlights

పాలను మరిగించేటప్పుడు స్టవ్ దగ్గర ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే పాలన్నీ పొంగిపోతాయి. దీంతో స్టవ్ కూడా మురికిగా మారుతుంది. అయితే మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం పాలు పొంగకుండా మరిగిపోతాయి. 


కొంతమంది టీ, కాఫీలను తాగితే మరికొంతమంది పాలను తాగుతుంటారు. పాలతో ఏం చేయాలన్నా వాటిని ఖచ్చితంగా బాగా మరిగించాల్సిందే. కానీ స్టవ్ దగ్గర ఎవరూ లేకుండా ఉంటే మాత్రం పాలు మొత్తం నేలపాలు అవుతాయి. నిజానికి పాలను మరగబెట్టడం అంత సులువైన పనేం కాదు. పాలను పొంగిపోకుండా కాయడం ఆడవాళ్లకు పెద్ద సవాలనే చెప్పాలి. అందుకే ఆడవాళ్లు పాలను మరిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా, పాలను కనిపెట్టుకుని ఉంటారు.

పాలను మరిగించేటప్పుడు మన దృష్టిని ఎక్కడ మరల్చినా పాలు పక్కా పొంగిపోతాయి. సిమ్ లో మంట పెట్టి మరిగించినా కూడా చాలా సార్లు పాలు పొంగుతుంటారు. ఈ అనుభవం చాలా మంది ఆడవారికి ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ పాలు పొంగకపోయినా.. చాలా సేపటి వరకు పాలను పొయ్యిమీదే ఉంచితే పాలన్నీ ఇంకిపోయి కొన్నే మిగులుతాయి. 

Latest Videos

టీ, కాఫీల కోసం పాలను రెగ్యులర్ మరిగించడం కామనే అయినా.. వీటిని మరిగించేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాలన్నీ పొంగిపోతాయి. ఏదో ఒక రోజు ఇలా జరిగితే పర్లేదు. కానీ తరచుగా పాలు పొంగిపోతుంటే మాత్రం చికాకు కలుగుతుంది. అందుకే పాలను మరిగించేటప్పుడు పొంగకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పాలు పొంగకూడదంటే ఏం చేయాలి?

పాలను ఎప్పుడూ కూడా చిన్న చిన్న గిన్నెలో మరిగించకూడదు. వీటిని పెద్ద గిన్నెలోనే మరిగించాలి. ఎందుకంటే చాలా మందికి చిన్న గిన్నెలోనే పాలను మరిగించే అలవాటు ఉంటుంది. కానీ దీనివల్ల పాలు పొంగుతాయి. అలాగే దీనివల్ల స్టవ్ కూడా ఆరిపోతుంది. ముఖ్యంగా పాలు వృథా అవుతాయి. పొయ్యి కూడా మురికిగా అవుతుంది. అందుకే పాలను మరిగించడానికి పెద్ద గిన్నెను మాత్రమే ఉపయోగించండి. ఇది పాలు వేడెక్కినప్పుడు పాలు విస్తరించడానికి తగినంత స్థలాన్ని అందిస్తుంది. దీంతో పాలు పొంగకుండా బాగా మరుగుతాయి. 

పాలు పొంగకుండా ఉండాలంటే.. పాలను మరిగిస్తున్నప్పుడు ఆ గిన్నెపై  ఒక చెక్క చెంచాను అడ్డంగా పెట్టండి. ఇది పాలు పొంగుకుండా చేస్తుంది. మీకు తెలుసా? చెక్క చెంచా గిన్నెపై పెడితే పాలు మరిగిపోయి పొంగకుండా చేస్తుంది. 

అలాగే పాలను మరిగించేటప్పుడు మీతో పాటుగా ఖచ్చితంగా గ్లాస్ వాటర్ ను ఉంచుకోండి. ఎందుంకటే పాలు మరిగి పొంగు వస్తున్నప్పుడు దాంట్లో కొన్ని నీళ్లను చల్లండి. ఇది పాలు పొంగకుండా చేయడానికి సహాయపడుతుంది. 

పాలను మరిగించే ముందు గిన్నెలో నెయ్యి లేదా వెన్నను వేయండి. ఈ గిన్నెలో నెయ్యి వేయడం వల్ల అది మృదువుగా మారుతుంది. దీంతో పాలు ఎంత మరిగినా అస్సలు పొంగే రాదు. పాలు గిన్నె నుంచి బయటకు అస్సలు రావు. 

పాలు మరుగుతున్నప్పుడు పొంగకూడదంటే ఉప్పును ఉపయోగించండి. అవును ఉప్పు పాలు పొంగకుండా చేయడానికి మీకు బాగా సహాయపడుతుంది. పాలు పొంగకుండా ఉండటానికి దాంట్లో చిటికెడు ఉప్పు వేసి కలపండి. ఇది పాలు పొంగకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పాలను బాగా కలియబెడితే కూడా వేడి గిన్నెకు సమానంగా వ్యాపిస్తుందిజ. దీంతో పాలు పొంగే అవకాశం ఉండదు. పైన చెప్పిన పద్ధతులను  అనుసరించి పాలను మరిగిస్తే.. పాలు పొంగవు. కిచెన్ మురికిగా కాకుండా కూడా ఉంటుంది. 

డబుల్ బాయిలర్ పద్ధతి

ఈ పద్దతిని ఎక్కువగా చాక్లెట్ లేదా వెన్నను కాల్చకుండా కరిగించడానికి ఉపయోగిస్తారు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక పెద్ద గిన్నెను స్టవ్ పై పెట్టి అందులో 1/4 వంతు నీళ్లను పోయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నీళ్లను బాగా మరిగించండి. ఈ వాటర్ మరగడం మొదలైనప్పుడు మీ పాల గిన్నెను దీంట్లో పెట్టండి. ఇప్పుడు మీ పాలు మెల్లెగా మరగడం ప్రారంభమవుతుంది. అయితే ఈ పద్ధతి సాధారణం కంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ పాలు పొంగకుండా చేయడంలో ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. డైరెక్ట్ గా మంట మీద ఉంచిన గిన్నె పాల కంటే పెద్దదిగా ఉండేలా చూసుకోవాలి.

స్పిల్ స్టోపర్

స్పిల్ స్టాపర్లు మార్కెట్ లో ఈజీగా దొరుకుతాయి. ఇవి బాయిలింగ్ సమస్యలకు చెక్ పెట్టడానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి సిలికాన్ ఆధారిత రబ్బరు డిస్క్ లు.  ఇవి మరుగుతున్న గిన్నెను కవర్ చేయడానికి ఉపయోగపడతాయి. స్పిల్ స్టాపర్ ను బాగా సాగదీసి దీనిని గిన్నెకు సరిగ్గా బిగించండి. ఇది పాలను పొంగకుండా చేస్తుంది. ఇది సిలికాన్ తో తయారవడం వల్ల ఇది మీ పాల నాణ్యతను ఏ మాత్రం తగ్గించదు. మీకు ఎలాంటి హాని చేయదు. 

click me!