టమాటాలను జుట్టుకు ఇలా పెడితే.. మీ జుట్టు రాలడం తగ్గి, ఎంత పొడుగ్గా పెరుగుతుందో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Oct 1, 2024, 11:45 AM IST

టమాటాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలుసు, కానీ జుట్టుకు కూడా అద్భుత ప్రయోజనాలు చేకూరుస్తాయి. టమాటా హెయిర్ మాస్క్ లతో జుట్టు రాలడాన్ని తగ్గించొచ్చు, చుండ్రును పోగొట్టొచ్చు, వెంట్రుకలకు గ్లో తీసుకురావచ్చు.


మన వంటింట్లో ఏ కూరగాయలు ఉన్నా, లేకున్నా టమాటాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే టమాటాలు లేని కూర అసలే ఉండదు. అందుకే టమాటాలను ఎక్కువ మొత్తంలో కొనేసి నిల్వ చేస్తుంటాం. నిజానికి టమాటాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ఇది అందరికీ తెలిసిన సంగతే. కానీ టమాటాలు, మన చర్మానికి, జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయన్న ముచ్చట మాత్రం చాలా మందికి తెలియదు. 

టమాటాల్లో మన జుట్టు పెరగడానికి అవసరమైన విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ తో పాటుగా ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. టమాటాలను ఉపయోగించి జుట్టు రాలడాన్ని తగ్గించొచ్చు. అలాగే నెత్తిమీద చుండ్రు మొత్తమే లేకుండా చేయొచ్చు. ఇది వెంట్రుకలకు గ్లో వచ్చేలా చేస్తుంది. టమాటా మాస్క్ లను జుట్టుకు, నెత్తికి అప్లై చేయడం వల్ల మీ జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే కొన్ని టమాటా హెయిర్ మాస్క్ లను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

టమాటా, తేనె, లెమన్ మాస్క్

Latest Videos

undefined

టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీరు ఈ హెయిర్ మాస్క్ ను ఉపయోగించి నెత్తిమీదున్న చుండ్రును పూర్తిగా పోగొట్టొచ్చు. అలాగే దురద నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. 

ఈ మాస్క్ కు కావల్సిన పదార్థాలు:

2 నుంచి 3 టమాటాలు
సగం నిమ్మకాయ
1 నుంచి 2 టీస్పూన్ల తేనె

ఎలా తయారుచేయాలి? 

ముందుగా టమాటాలను తీసుకుని బ్లెండర్ లో వేసి మెత్తని పేస్ట్ గా చేసి పక్కన పెట్టండి. ఈ పేస్ట్ లో తేనె, నిమ్మరసం వేసి బాగా కలపండి. తర్వాత జుట్టుకు మూలాల నుంచి చివర్ల వరకు బాగా పట్టించండి. తర్వాత చేతులతో కొద్ది సేపు బాగా మసాజ్ చేయండి. ఈ హెయిర్ మాస్క్ ను 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూ, నార్మల్ వాటర్ తో క్లీన్ చేస్తే సరిపోతుంది.

టమాటా, కొబ్బరి నూనె మాస్క్

టమాటా, కొబ్బరి నూనె రెండింటిలో మన జుట్టుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ రెండూ మన వెంట్రుకలను బలంగా, ఆరోగ్యంగా, షైనీగా చేయడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు ఈ హెయిర్ మాస్క్ కొత్త వెంట్రుకలు వచ్చేలా కూడా చేస్తుంది. 

టమాటా, కొబ్బరి నూనె మాస్క్ ను తయారుచేయానికి కావాల్సిన పదార్థాలు

3 నుంచి 4 టీ స్పూన్ల కొబ్బరి నూనె
2 నుంచి 3 టమోటాలు

టమాటా, కొబ్బరి నూనె మాస్క్ ను ఎలా తయారుచేయాలి?

ముందుగా టమాటాలను బ్లెండర్ లో వేసి మెత్తని పేస్ట్ ను తయారుచేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి కొబ్బరి నూనె వేడి అయ్యాకా దాంట్లో టమాటా ప్యూరీని వేయండి. కొద్ది సేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఈ పేస్ట్ గోరువెచ్చగా అయిన తర్వాత వెంట్రుకల కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పెట్టి మసాజ్ చేయండి. 30 నుంచి 40 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేసి కండీషనర్ ను వాడండి. 

టమాటా, పెరుగు మాస్క్

పెరుగు చుండ్రును పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ మాస్క్ జుట్టును ఆరోగ్యంగా ఉంచి, బాగా పెరిగేలా చేస్తుంది. అలాగే ఇది మీ జుట్టు వెంట్రుకలను షైనీగా, సాఫ్ట్ గా చేయడానికి కూడా బాగా సహాయపడుతుంది. 

టమాటా, పెరుగు మాస్క్ కు కావాల్సిన పదార్థాలు
1 నుంచి 2 టమాటాలు
2-3 టీస్పూన్ల పెరుగు

టమాటా, పెరుగు మాస్క్ ను తయారుచేసే ప్రక్రియ

ముందుగా టామాటాలను మెత్తగా బ్లెండ్ చేసి దాంట్లో పెరుగు వేసి కలపండి. దీంట్లోనే 1-2 టీస్పూన్ల కొబ్బరి నూనెను కూడా వేయండి. ఈ పేస్ట్ ను మీ జుట్టు మొత్తానికి బాగా అప్లై చేయండి. 15-30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేసి కండీషనర్ ను ఉపయోగించండి. 

టమాటా జ్యూస్, ఆముదం నూనె

టమాటాల్లో ఆమ్ల లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి డ్రై హెయిర్ పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాకుండా మీ నెత్తిమీద అదనపు నూనె ఉత్పత్తి కాకుండా చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇది నెత్తిమీద రక్త ప్రసరణను బాగా పెంచుతుంది. 

టమాటా జ్యూస్, ఆముదం నూనె మాస్క్ కు కావాల్సిన పదార్థాలు

2 నుంచి 3 టమాటాలు 
కాస్టర్ ఆయిల్

టమాటా జ్యూస్, ఆముదం నూనె మాస్క్ ను తయారుచేసే విధానం: 

ముందుగా టమాటాలను తీసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి ప్యూరీని పక్కన పెట్టుకోండి. ఈ పేస్ట్ లో ఆముదం నూనెను వేసి కలపండి. లేదా దీన్ని నేరుగా తలకు కూడా పెట్టొచ్చు. ఈ పేస్ట్ ను జుట్టు 20-30 నిమిషాల పాటు ఉండనివ్వండి. ఆ తర్వాత నీటితో కడిగి మైల్డ్ షాంపూ, కండీషనర్ ను వాడండి. 

click me!