పీరియడ్స్ టైంలో బొప్పాయి తినొచ్చా?

By Mahesh Rajamoni  |  First Published Mar 31, 2023, 3:42 PM IST

సాధారణంగా అయితే ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయిని తినకూడదని నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ పండును పీరియడ్స్ సమయంలో తినొచ్చా? లేదా? 
 



పీరియడ్స్ సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే పీరియడ్స్ అయినా,  ప్రెగ్నెన్సీ  అయినా బొప్పాయికి దూరంగా ఉండాలని చాలా మంది చెబుతుంటారు. కొంతమంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రెండు సమయాల్లో పండిన బొప్పాయిని ఎంచక్కా తినొచ్చు. పండని బొప్పాయిని మాత్రమే తినకూడదని నిపుణులు చెబుతున్నారు. పండిన బొప్పాయి తినడం ఆరోగ్యకరమైనది. పండని బొప్పాయిలు కాదు. పండని బొప్పాయిలు రబ్బరు పాలు, పాపైన్ తో  నిండి ఉంటాయి. ఇవి గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తాయి. దీంతో తీవ్రమైన అలెర్జీ వస్తుంది. అలాగే ప్రసవం ముందుగానే అయ్యేలా చేస్తాయి. అలాగే పీరియడ్స్ సమయంలో కూడా బొప్పాయిని తినేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. 

పీరియడ్స్ సమయంలో బొప్పాయి తినొచ్చా?

Latest Videos

undefined

బొప్పాయి వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. పండిన, పండని బొప్పాయిలు శరీరంలో అధిక వేడిని ఉత్పత్తి చేస్తాయి. అలాగే పిండం, రుతుచక్రం రెండింటికీ అంతరాయం కలిగించే "వేడి ఆహారాలు" అని కూడా సాధారణంగా నమ్ముతారు. ఏదేమైనా ఈ బొప్పాయి మన శరీరం ఉష్ణోగ్రతను పెంచి ఏవైనా సమస్యలను కలిగిస్తుందో? లేదో? తెలుసుకోవడానికి ఎలాంటి పరిశోధనలు జరగలేదు.

పలు అధ్యయనాల ప్రకారం పండిన బొప్పాయి తినడం ప్రమాదకరమైనదేం కాదు. బొప్పాయి పీరియడ్స్ సమయంలో హాని కలిగించదు. బొప్పాయి వేడి ఆహారం అయినప్పటికీ.. ఇది రుతుచక్రంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. వాస్తవానికి పీరియడ్స్ సమయంలో బొప్పాయి తినడం సురక్షితమే కాదు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మీ శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఈ పండుద్వారా అందుతాయి. ఇవి మీ రుతుచక్రాన్ని సజావుగా చేస్తాయి. అలాగే ఉబ్బరం, మలబద్దకాన్ని కూడా నివారిస్తాయి. అయినప్పటికీ దీన్ని లిమిట్ లోనే తినాలి. 

పీరియడ్స్ సమయంలో బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

బొప్పాయిలో ఫైబర్, ఎంజైమ్లు, గ్లైకోసైడ్లతో పాటు ఫైటోకెమికల్స్, విటమిన్లు, ఖనిజాలు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. 

 రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది

నిపుణుల ప్రకారం.. బొప్పాయి గర్భాశయ కండరాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే బొప్పాయిలో  ఉండే కెరోటిన్ కంటెంట్ నొప్పి లేదా తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడుతుతంది. 

గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది

జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తెుంది. బొప్పాయి తీవ్రమైన తిమ్మిరి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడే మహిళలకు ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్, వాటర్ కంటెంట్ ప్రేగు కదలికను నియంత్రిస్తుంది. రుతుస్రావం సమయంలో వచ్చే మలబద్దకాన్ని నివారిస్తుంది. బొప్పాయి గర్భాశయ కండరాలు సరిగ్గా పనిచేయడానికి కూడా మద్దతునిస్తుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో పండిన బొప్పాయిని ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా తినండి.

బొప్పాయిని క్రమం తప్పకుండా తినడం వల్ల గర్భాశయ కండరాల సంకోచానికి సహాయపడుతుంది. ఈ పండు శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడమే కాకుండా, కెరోటిన్ కలిగి ఉంటుంది. ఈ పదార్ధం శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలను ప్రేరేపిస్తుంది లేదా నియంత్రిస్తుంది. సహజంగా ఇది పీరియడ్స్ లేదా రుతుస్రావాన్ని ఎక్కువగా ప్రేరేపిస్తుంది.
 

click me!