
వేసవికాలం చర్మ సంరక్షణ విషయంలో చాలా ఇబ్బందులు తెస్తుంది. ఎండ, వేడి గాలుల వల్ల చర్మం ట్యాన్ అవ్వడం సహజం. మనం ముఖానికి ఎక్కువ శ్రద్ధ పెట్టి, చేతులను నిర్లక్ష్యం చేస్తాం. ఎండకి నేరుగా గురైన చేతులు నల్లగా మారుతాయి.
ట్యాన్ తొలగించడానికి మార్కెట్లో చాలా ఉత్పత్తులు ఉన్నాయి. కానీ అవి ఖరీదైనవి లేదా కెమికల్స్ వల్ల వాటిని వాడటానికి ఇష్టపడం. అందుకే ఇంట్లో దొరికే వస్తువులతో చేసే మాస్క్ లు సురక్షితమైనవి. ఇవి ట్యాన్ ని తగ్గించడమే కాకుండా, చర్మానికి పోషణనిచ్చి, సహజమైన కాంతిని తిరిగి తెస్తాయి. ఈ వ్యాసంలో కొన్ని సులభమైన, ప్రభావవంతమైన ఇంట్లో తయారుచేసుకునే మాస్క్ ల గురించి తెలుసుకుందాం.
రెండు చెంచాల శెనగపిండి, చిటికెడు పసుపు, చెంచా పెరుగు కలిపి పేస్ట్ చేయాలి. దానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. చేతులకి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది ట్యాన్ తగ్గించి, చర్మానికి తేమనిస్తుంది.
రెండు చెంచాల ఆలొవెరా జెల్ కి చెంచా నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ట్యాన్ ఉన్న చోట రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఆలొవెరా చర్మాన్ని చల్లబరుస్తుంది, నిమ్మరసం ట్యాన్ ని తగ్గిస్తుంది.
బంగాళాదుంపను నేరుగా చేతులకి రాసుకోవచ్చు. లేదా తురిమిన బంగాళాదుంపకి గులాబీనీరు కలిపి పేస్ట్ చేసి, చేతులకి రాసుకుని ఆరనివ్వాలి. తర్వాత నీళ్ళతో కడిగేయాలి. బంగాళాదుంపలో సహజ బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి.
టమాటా రసం కి తేనె కలిపి, చేతులకి రాసుకుని 20 నిమిషాలు ఉంచి, చల్లటి నీళ్ళతో కడిగేయాలి. టమాటా ట్యాన్ ని తగ్గిస్తుంది, తేనె చర్మానికి తేమనిస్తుంది.
రెండు చెంచాల దోసకాయ రసం, చెంచా ముల్తానీ మట్టి కలిపి పేస్ట్ చేసి, చేతులకి రాసుకుని ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేయాలి. ఇది చర్మాన్ని చల్లబరిచి, ట్యాన్ ని తగ్గిస్తుంది.