Beauty Tips: ఇవి రాస్తే, మీ పెదాలు ఎర్రగా మారడం పక్కా..!

Published : May 31, 2025, 04:16 PM IST
Dark Lips Home Remedies

సారాంశం

మనం ఇంట్లోనే కొన్ని హోం రెమిడీలు ప్రయత్నించడం వల్ల మీ పెదాలు ఎర్రగా, అందంగా మారతాయి.

అందంగా కనిపించాలనే కోరిక ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది. అలా అందంగా కనిపించాలి అంటే.. మన ముఖంతో పాటు, మన పెదాలు కూడా అందంగా ఉండాలి. చాలా మంది ముఖం మీద పెట్టిన శ్రద్ధ..పెదాల మీద పెట్టరు. అవి పగిలిపోయి, నిస్తేజంగా ఉంటే ముఖంలో కళ కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా.. మీ పెదాలు లిప్ స్టిక్ కూడా అవసరం లేనంత ఎర్రగా, మృదువుగా కనిపించాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మనం ఇంట్లోనే కొన్ని హోం రెమిడీలు ప్రయత్నించడం వల్ల మీ పెదాలు ఎర్రగా, అందంగా మారతాయి.

తేనె – కొబ్బరి నూనె కలయిక

తేనె, కొబ్బరి నూనె రెండింటిని మంచి మిశ్రమంలా కలపాలి. ఈ మిశ్రమాన్ని 15 సెకన్లు వేడి చేసి చల్లారిన తరువాత ప్రతి రోజు పెదవులపై ఉపయోగించాలి. ఇది పెదవుల మీద ఉన్న ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. మృదువుగా కూడా మారుస్తుంది.

తేనె – అవకాడో గుజ్జు

తేనెతో పాటు అవకాడో గుజ్జు కలిపితే విటమిన్లు, ఖనిజాలతో పెదవులు మృదువుగా మారతాయి. పెదవుల తేమను నిలబెట్టడంలో ఇది సహాయపడుతుంది. సహజంగా ఎర్రగా మారుస్తాయి.

పెరుగు – కివి మిశ్రమం

పెరుగు, మెత్తగా చేసిన కివిని కలిపి అప్లై చేస్తే చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి. ఇది పెదవులకు ప్రకాశాన్ని ఇస్తుంది.

తేనె – దోసకాయ పేస్ట్

తేనెతో పాటు మెత్తగా చేసిన దోసకాయ కలయిక వేడికీ, మంటలకీ ఉపశమనంగా పనిచేస్తుంది. వేసవికాలంలో చల్లదనాన్ని కలిగిస్తుంది.

కలబంద – చక్కెర మిశ్రమం

కలబంద, చక్కెర మిశ్రమం కూడా పెదాలను అందంగా మారుస్తుంది. ఈ రెండింటిని బాగా కలిపి పెదాలకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు మృదువుగా మారతాయి.. చనిపోయిన చర్మాన్ని తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

కొబ్బరి నూనె – చక్కెర కలయిక

పెదవులపై ఉన్న మురికిని తొలగించడానికి కొబ్బరి నూనె, చక్కెర కలిపి రాస్తే చాలు. ఈ రెండింటి కలిపి పెదాలకు రాస్తే, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి అందంగా కనిపిస్తాయి.

గులాబీ రేకులు – పాలు పేస్ట్

తాజా గులాబీ రేకులతో పాలను కలిపి మెత్తగా చేసిన పేస్ట్‌ను 15 నిమిషాలు పెదవులపై ఉంచాలి. ఇది సహజమైన గులాబీ రంగును ఇచ్చేలా చేస్తుంది.

ఆలివ్ ఆయిల్ – బ్రౌన్ షుగర్ మిశ్రమం

ఈ సహజమైన ఎక్స్‌ఫోలియేషన్ మిక్స్ పెదవులను మెత్తగా, నిగనిగలాడేలా చేస్తుంది. తేమను నిలబెట్టడంలో ఇది ఎంతో బాగుంటుంది.

ఈ ఇంటి చిట్కాలు సులభమైనవే కాకుండా, అధిక ఖర్చు లేకుండా మెరిసే పెదవులను అందిస్తాయి. ప్రతిరోజూ కొద్దిసేపు పెదవుల సంరక్షణకు సమయం కేటాయిస్తే మీ చిరునవ్వు మరింత ఆకర్షణీయంగా మారుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pendant: సింపుల్ చైన్ కి రాయల్ లుక్ ఇచ్చే జాడు పెండెంట్..
Gold Plated Earrings: బడ్జెట్ ధరలో బంగారంలా మెరిసే ఇయర్ రింగ్స్..