ఇలా తలస్నానం చేస్తే మీ జుట్టు ఊడిపోవడం ఖాయం

By Shivaleela Rajamoni  |  First Published Sep 30, 2024, 2:18 PM IST

కొంతమంది రోజూ తలస్నానం చేస్తే.. మరికొంతమంది వారానికి రెండు మూడు సార్లు చేస్తుంటారు. అయితే తలస్నానం వల్ల కూడా జుట్టు రాలే ప్రమాదం ఉంది తెలుసా? ఎలా అంటే?
 


ప్రతి ఒక్కరికీ వెంట్రుకలు రాలిపోతుంటారు. ఇది చాలా కామన్. అయితే ప్రతి ఒక్కరికీ వెంట్రుకలు రెండు నుంచి ఆరు సంవత్సరాల వరకు పెరిగి ఆ తర్వాత రాలిపోతుంటాయి. ఆ తర్వాత కొత్త వెంట్రుకలు వస్తాయి. ఇది ప్రతి ఒక్కరిలో సర్వ సాధారణం. అయితే ప్రతి ఒక్కరి నెత్తిమీద 100,000 వెంట్రుకల వరకు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వీటిలో రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు ఊడిపోవడం కామన్. దీనివల్ల మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఇంతకు మంచి ఊడిపోతేనే మీరు జాగ్రత్త పడాలి. 

జుట్టు ఎక్కువగా ఎందుకు ఊడిపోతుంది? 

వెంట్రుకలు రాలడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి.  టైట్ గా ఉండే హెయిర్ స్టైల్స్ వల్ల జుట్టు మూలాలు వదులుగా అయ్యి ఊడిపోతుంది. అలాగే కీమథెరఫీ, రేడియేషన్ థెరఫీ చికిత్సల వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే వృద్ధాప్యం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, థైరాయిడ్ సమస్యతో జుట్టు బాగా రాలుతుంది. అలాగే జన్యుపరంగా, హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల కూడా బట్టతల వస్తుంది. ముఖ్యంగా శరీరంలో పోషకాలు లోపించడం, బాగా బరువు తగ్గిపోపోవడం, సోరియాసిస్ లేదా ఫోలిక్యులిటిస్ వంటి చర్మ సమస్యలు, యాంగ్జైటీ, ఓవర్ స్ట్రెస్, గుండె జబ్బులకు మందులు తినడం వంటి ఎన్నో కారణాల వల్ల జుట్టు బాగా ఊడిపోతుంది. అంతేకాదు తలస్నానం చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది.

తలస్నానం ఎలా చేస్తె జుట్టు ఊడిపోతుంది? 

Latest Videos

undefined

 

అతిగా కడగడం: చాలా మంది నెత్తిమీద జిడ్డు, దుమ్ము, ధూళి పోయి శుభ్రంగా కావాలని నెత్తిని మోతాదుకు మించి చాలా సేపటి వరకు కడుగుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీ జుట్టు పొడిగా, పెళుసుగా అవుతుంది. ఎందుకంటే జుట్టును ఎక్కువ సేపు కడిగితే మీ నెత్తిమీదుండే నేచురల్ ఆయిల్స్ బయటకు వెళ్లిపోతాయి. 

షాంపూ

చాలా మంది జుట్టు బాగా పెరగాలని, ఊడిపోకూడదని సల్ఫేట్ ఆధారిత షాంపూలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ వీటిని జుట్టుకు అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇవి వెంట్రుకలు, నెత్తమీదుండే సహజ నూనెలను తొలగిస్తుంది. అలాగే జుట్టు పొడిబారేలా చేయడమే కాకుండా.. విపరీతంగా రాలేలా చేస్తుంది. 

వేడి నీళ్లు

కొంతమంది కాలాలతో సంబంధం లేకుండా వేడినీళ్లతోనే తలస్నానం చేస్తుంటారు. కానీ ఎక్కువ వేడిగా ఉండే నీళ్లతో తలస్నానం అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీ జుట్టు బాగా దెబ్బతింటుంది. అలాగే బాగా ఊడిపోతుంది. అందుకే మరీ ఎక్కువ వేడిగా ఉండే నీళ్లకు బదులుగా గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయండి. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. 

కండీషనర్: ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జుట్టుకు కండీషనర్ ను ఉపయోగించాలి. ఈ కండీషనర్ ఉపయోగించకపోతే మీ జుట్టు పొడిబారుతుంది. అలాగే పెళుసుగా అయ్యే  ప్రమాదం పెరుగుతుంది. అందుకే షాంపూ చేసిన తర్వాత ఖచ్చితంగా కండీషనర్ ను వాడండి. ఇది మీ జుట్టు ఆకృతిని కూడా మెరుగుపరుస్తుంది.

షాంపూ పరిమాణం

నెత్తిమీద, జుట్టుకు అంటుకున్న మురికి అంతా పోవాలని చాలా మంది జుట్టుకు షాంపూను మరీ ఎక్కువగా పెడుతుంటారు. కానీ దీనివల్ల మీ జుట్టు, నెత్తిమీద ఉన్న సహజ నూనెలు తొలగిపోతాయి. దీంతో మీ జుట్టు బాగా పొడిబారుతుంది. అలాగే రాలడం కూడా స్టార్ట్ అవుతుంది. అందుకే షాంపూను ఎక్కువగా వాడకండి. అవసరమైనంత మాత్రమే వాడండి. 

స్కాల్ఫ్ మసాజ్: డ్రై హెయిర్ కు స్కాల్ప్ మసాజ్ చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ మీరు ఈ మసాజ్ ను తప్పుగా చేస్తే మాత్రం మీ జుట్ట కుదుళ్లు బాగా దెబ్బతింటాయి. ఇది మీ జుట్టు రాలేలా చేస్తుంది. అందుకే జుట్టుకు సరైన పద్దతిలోనే మసాజ్ చేయండి. 

స్నాన పద్ధతి: జుట్టును ఏదో కడిగామా? అంటే కడిగాము అని అనకుండా.. సరిగ్గా క్లీన్ చేయాలి. లేదంటే మీ జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఎందుకంటే షాంపూను సరిగ్గా క్లీన్ చేయకపోతే జుట్టులో షాంపూ మొదలైన వాటి అవశేషాలు ఉంటాయి. ఇవి మీ నెత్తిమీద చికాకును కలిగిస్తాయి. అలాగే జుట్టు రాలడానికి కారణమవుతాయి. 

టవల్స్: మనలో ప్రతి ఒక్కరూ స్నానం చేసిన తర్వాత జుట్టు ఆరడానికి టవల్స్ ను ఉపయోగిస్తుంటాం. ఇది చాలా కామన్. కానీ జుట్టుకు వాడే టవల్ చాలా ముతకగా ఉంటే మీ జుట్టు రాలేలా చేస్తుంది. అందుకే జుట్టుకు వాడే టవల్స్ మైక్రోఫైబర్ టవల్ లేదా పాత టీ-షర్ట్ ను ఉపయోగించండి.

తడి జుట్టు: స్నానం చేసిన తర్వాత తడి జుట్టును దువ్వే అలవాటు కూడా కొంతమందికి ఉంటుంది. కానీ తడి జుట్టును దువ్వితే మీ జుట్టు దెబ్బతింటుంది. అలాగే బాగా రాలుతుంది. కాబట్టి జుట్టు బాగా ఆరిన తర్వాత మాత్రమే జుట్టును దువ్వండి. 
 

జుట్టు రాలకూడదంటే ఏం చేయాలి?

బయోటిన్ సప్లిమెంట్స్:  బయోటిన్ అనే బి విటమిన్ మీ  జుట్టు రాలకుండా చేయడానికి ఎంతో సహాయపడుతుంది. గింజలు, విత్తనాలు, చేపలు, మాంసం, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి ఆహారాల్లో బయోటిన్ మెండుగా ఉంటుంది. ఇవి తిన్నా మీ జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. అలాగే విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, జింక్ లు కూడా జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. 

స్కాల్ప్ మసాజ్ : స్కాల్ప్ మసాజ్ కూడా జుట్టును రాలకుండా చేసి మీ జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరగడానికి బాగా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఒక ఆరు నెలల పాటు రోజూ నాలుగు నిమిషాలు నెత్తిని మసాజ్ చేస్తే జుట్టు రాలడం తగ్గిందని ఒక ప్రాథమిక అధ్యయనం వెల్లడించింది. 

click me!