జామ ఆకుల్లో కూడా ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ ఆకులను ఉపయోగించి మనం కొన్ని అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే చర్మ సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. జామ ఆకులు మన చర్మానికి ఎలాంటి మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఆడవారు అందంగా కనిపించాలని ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు. కానీ మనం వాడే చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో హానికరమైన కెమికల్స్ ఉంటాయి. ఇవి మీ ముఖాన్ని అందంగా మార్చినా.. భవిష్యత్తులో మీకు చర్మ సమస్యలు వచ్చేలా చేస్తాయి. అందాన్ని కూడా పాడు చేస్తాయి.
నిజానికి నేచురల్ పద్దతిలో కూడా మీరు మీ అందాన్ని పెంచుకోవచ్చు. ఇవి మీ ముఖానికి ఎలాంటి హాని చేయవు. అంతేకాకుండా.. చర్మానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. ఇలాంటి వాటిలో జామ ఆకులు ఒకటి. అవును జామ ఆకులతో కూడా ముఖాన్ని అందంగా మార్చేయొచ్చు. ఈ ఆకుల్లో విటమిన్ సి, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడతాయి.అలాగే ముఖంపై నల్ల మచ్చలను, తెల్ల మచ్చలను పోగొట్టడానికి బాగా సహాయపడతాయి.
undefined
కొంతమందికి డ్రై స్కిన్ ఉంటే.. మరికొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారు ఎంత మేకప్ వేసినా.. కొద్దిసేపటికే జిడ్డుగా మారుతుంది. ఇలాంటి వారు ఏ కాస్మోటిక్స్ ఉపయోగించినా ఎలాంటి యూజ్ ఉండదు. అయితే ఇలాంటి వారికి జామ ఆకులు బాగా ఉపయోగకరంగా ఉంటాయి.
ఇందుకోసం ముందుగా గుప్పెడు జామ ఆకులను తీసుకుని నీళ్లలో నానబెట్టండి. దీన్ని పేస్ట్ గా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి, మెడకు బాగా పట్టించండి. 30 నిమిషాల తర్వాత కూల్ వాటర్ తో ముఖాన్ని మెడను శుభ్రం చేయండి. జామ ఆకుల్లో ఉండే పోషకాలు మీ ముఖంలో ఉండే నూనెను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ పద్దతి జిడ్డును చాలా వరకు తగ్గించడానికి సహాయపడుతుంది.
ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలుంటే అందంగా కనిపించవు. ముఖాన్ని చూడగానే ఇవే కనిపిస్తుంటారు. ఈ చర్మ సమస్యల వల్ల ఒక్కోసారి ఆడవారు బయటకు వెల్లడానికి కూడా ఇంట్రెస్ట్ చూపరు. అయితే ఈ సమస్యలను తగ్గించడంలో జామ ఆకులు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
జామ ఆకులను ఉపయోగించి ముఖంపై ఉన్న తెల్ల మచ్చలను, నల్ల మచ్చలను, మొటిమల వల్ల అయ్యే మొండి మచ్చలను సులువుగా పోగొట్టొచ్చు. ఇందుకోసం గుప్పెడు జామ ఆకులను తీసుకుని అందులో కలబంద గుజ్జు, కొంచెం పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిముషాల పాటు అలాగే వదిలేయండి. తర్వాత కూల్ వాటర్ తో ముఖాన్ని కడిగేయండి. తరచుగా ఇలా చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.
పొడి చర్మం ఉన్నవారికి కూడా జామ ఆకులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే చర్మ చికాకు ను తగ్గించడానికి కూడా జామ ఆకులు ఉపయోగపడతాయి. దీనికోసం జామ ఆకుల స్ప్రేని ఉపయోగించాలి. ఇందుకోసం ఒక కప్పు జామ ఆకులను తీసుకుని అందులో నీళ్లు పోసి 10 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఇవి చల్లారిన తర్వాత నీళ్లను వడకట్టి స్ప్రే బాటిల్ లో పోయండి. ముఖాన్ని నీట్ గా కడిగిన తర్వాత ముఖానికి ఈ స్ప్రే చేయండి.
ముఖంపై మడతలు ఎన్నో కారణాల వల్ల వస్తాయి. ఒత్తిడి, నిద్ర లేకపోవడం, బిజీ లైఫ్ వంటి ఎన్నో కారణాల వల్ల ముఖంపై ముడతలు వస్తాయి. వీటివల్ల కండరాలు వదులుగా అయ్యి ముడతలు ఏర్పడతాయి. అందుకే టెన్షన్ లేకుండా ఆనందంగా ఉంటేనే ముఖంపై ముడతలు రావు. అందులో వయసు పెరిగే కొద్దీ ముడతలు ఏర్పడటం చాలా కామన్. ఇలాంటి వారు కెమికల్ ప్రొడక్ట్స్ ను వాడకపోవడమే మంచిది.
కొబ్బరి నూనె ముఖంపై ముడతలను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే ముఖానికి మేకప్ వాడితే దానిని రిమూవ్ చేయడానికి కొబ్బరి నూనెను వాడండి. కొబ్బరినూనెను పెట్టి కొద్ది సేపు మసాజ్ చేయండి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేస్తే కండరాలు బిగుసుకుపోతాయి. ముడతలు తగ్గిపోతాయి.
పుల్లని ఆహారాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పెరుగు. పెరుగులో విటమిన్ బి 12, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, కాల్షియంతో పాటుగా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా, కాంతివంతంగా చేయడానికి సహాయపడతాయి. కాబట్టి మీరు పెరుగు ఫేస్ ప్యాక్ ను కూడా ఉపయోగించొచ్చు.
ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి పెరుగును పెట్టి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. తర్వాత కూల్ వాటర్ తో శుభ్రం చేయండి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. దీంతో ముఖంపై మొటిమలు ఏర్పడవు.