బ్యాడ్మింటన్ కోర్టులో చెమటలు చిందిస్తున్న దీపికా.. ఎదురుగా ఉంది ఎవరో తెలుసా..?

Published : Sep 22, 2021, 11:30 AM ISTUpdated : Sep 22, 2021, 11:40 AM IST
బ్యాడ్మింటన్ కోర్టులో చెమటలు చిందిస్తున్న దీపికా.. ఎదురుగా ఉంది ఎవరో తెలుసా..?

సారాంశం

తన జీవితంలో ఒకరోజు అంటూ.. సింధూతో కలిసి క్యాలరీలు కరిగిస్తున్నానంటూ ఆమె ఆ ఫోటోలను షేర్ చేశారు. మొదటి ఫోటోలో ఇద్దరూ కలిసి నవ్వుతూ కనిపించారు

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే (Deepika Padukone) .. సినిమా షూటింగ్ లతో బిజీ బిజీగా గడుపుతారనే విషయం మనకు తెలిసిందే.  అయితే.. ఆమె ప్రస్తుతం.. బ్యాడ్మింటన్ కోచింగ్ తీసుకుంటున్నారు. అది కూడా ఒలంపిక్ విజేత పీవీ సింధూ (PV Sindhu) దగ్గర తీసుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియెని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇది కాస్త వైరల్ గా మారింది.

తన జీవితంలో ఒకరోజు అంటూ.. సింధూతో కలిసి క్యాలరీలు కరిగిస్తున్నానంటూ ఆమె ఆ ఫోటోలను షేర్ చేశారు. మొదటి ఫోటోలో ఇద్దరూ కలిసి నవ్వుతూ కనిపించారు. కాగా.. వీరి ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మరో ఫోటోలో ఇద్దరూ బ్యాడ్మింటన్ ఆడి అలసిపోయి చెమటలతో కినిపించడం గమనార్హం.

కాగా.. పీవీ సింధూ జీవిత కథ ఆధారంగా త్వరలో సినిమా తెరకెక్కనుందని.. అందులో.. దీపికా పుదకొణే ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది. కాగా.. ఈ ప్రాక్టీస్ కూడా దానిలో భాగంగానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

10 గ్రాముల్లో అందమైన బంగారు నెక్లెస్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!
పాదాల అందాన్ని రెట్టింపు చేసే మెట్టెలు