
ఫ్యాషన్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. ఈ కాలంలో దాదాపు అందరూ ట్రెండ్ కి తగినట్లు దుస్తులు వేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఆఫీసుకీ, బయటకు వెళ్లినప్పుడు మాత్రమే మంచి దుస్తులు వేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు..లౌంజ్ వేర్, నైట్ వేర్, హోమ్ వేర్ కూడా అంతే ట్రెండీగా, స్టైలిష్ గా మారాయి.
కో-ఆర్డ్ సెట్స్, నైట్ సూట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్నాయి. చాలా మంది రెండూ ఒకటే అనుకుంటారు, కానీ అవి వేరు. రెండింటికీ వాటి స్థానం, ప్రాముఖ్యత ఉంది. సరైన సమయంలో, సందర్భంలో సరైన ఫ్యాషన్ ఎంచుకోవడమే నిజమైన స్టైల్. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చూద్దాం, తర్వాత షాపింగ్ చేసేటప్పుడు సరైనది ఎంచుకోవచ్చు.
కో-ఆర్డ్ సెట్స్: పైన, కింద డ్రెస్ ఒకే ప్యాట్రన్, కలర్, ఫాబ్రిక్ తో ఉంటాయి. స్టైలిష్ గా, పాలిష్డ్ లుక్ ఇస్తాయి. బయటకి వెళ్ళడానికి, ప్రయాణించడానికి, లౌంజ్ చేయడానికి వీటిని వేసుకోవచ్చు. ప్యాంట్-టాప్, షార్ట్స్-షర్ట్, క్రాప్ టాప్-ప్లాజో లాంటి స్టైలిష్ వెరైటీలు ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయి.
నైట్ సూట్స్: హాయిగా ఉండడానికి, నిద్రపోయేటప్పుడు వేసుకునేవి. కాటన్, సాటిన్, రేయాన్ లాంటి మృదువైన, గాలి ఆడే ఫాబ్రిక్ తో ఉంటాయి. ఓవర్ సైజ్ షర్ట్స్ తో పైజామా, టీ షర్ట్స్ తో షార్ట్స్ అందుబాటులో ఉంటాయి.
కో-ఆర్డ్ సెట్స్ పాలిస్టర్, లెనిన్, ఖాదీ, జార్జెట్, నిట్టెడ్ ఫాబ్రిక్ తో ఉంటాయి. డిజైనింగ్ మీద దృష్టి పెడతారు కాబట్టి ఫిట్టింగ్, కట్స్, టెక్స్చర్ బాగుంటాయి. నైట్ సూట్స్ తేలికైన, చర్మానికి హానిచేయని కాటన్, మోడల్, సాటిన్ ఫాబ్రిక్ తో ఉంటాయి. అలసట, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు హాయిగా ఉంటాయి.
కో-ఆర్డ్ సెట్స్ ని బెల్ట్, జాకెట్, స్నీకర్స్, బ్యాగ్స్, సన్ గ్లాసెస్ తో స్టైల్ చేసుకోవచ్చు. ఇన్స్టా-రెడీ, పార్టీకి పర్ఫెక్ట్ లుక్ ని ఇస్తాయి. నైట్ సూట్స్ ని సింపుల్ గా ఉంచుతారు, ఎందుకంటే అవి ఫ్యాషన్ కోసం కాదు, రిలాక్స్ కావడానికి. క్యూట్ ప్రింట్స్, పాస్టెల్ షేడ్స్, కార్టూన్ క్యారెక్టర్స్ వీటికి ఫన్ లుక్ ఇస్తాయి.
కో-ఆర్డ్ సెట్స్ ని మాల్, కేఫ్, ప్రయాణం, ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు వేసుకోవచ్చు. నైట్ సూట్స్ నిద్రపోవడానికి, రిలాక్స్ కావడానికి మాత్రమే. బయట వేసుకోకూడదు. కో-ఆర్డ్ సెట్స్ ఫ్యాషన్ కి, నైట్ సూట్స్ హాయికి.
కో-ఆర్డ్ సెట్స్ లో పోల్కా డాట్స్, స్ట్రైప్స్, ఇండో-వెస్ట్రన్ ప్రింట్స్, స్కర్ట్+టాప్ ట్రెండ్ లో ఉన్నాయి. నైట్ సూట్స్ లో సాటిన్ పింక్, కాటన్ కుర్తా-పైజామా, ఫంకీ ప్రింట్స్ ఉన్న షార్ట్స్, లాంగ్ నైట్ గౌన్స్ బాగా నచ్చుతున్నాయి.