
వయసుతో సంబంధం లేకుండా అందంగా కనిపించాలి అనే కోరిక దాదాపు అందరిలోనూ ఉంటుంది. దాని కోసమే అందరూ ముఖానికి ఏవేవో పూసేస్తూ ఉంటారు. అయితే.. ఒక్కోసారి ముఖంపై ముఖ్యంగా ముక్కుపై బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి. ఇవి మన ముఖ సౌందర్యాన్ని దెబ్బ తీస్తూ ఉంటాయి. ఆ బ్లాక్ హెడ్స్ ని తొలగించడం అంత సులువేమీ కాదు. బ్యూటీ పార్లర్ కి వెళ్లి తీయించుకోవాల్సిందే. అది కూడా పెయిన్ ఫుల్ గానే ఉంటుది. కానీ, వాటిని కూడా ఈజీగా తొలగించే మంచి పద్దతి ఒకటి ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
బియ్యం నీటిని ఈ మధ్యకాలంలో చాలా మంది అందాన్ని పెంచుకోవడానికి చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఇదే బియ్యం నీరు.. ముఖం మీద బ్లాక్ హెడ్స్ తొలగించడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. బియ్యాన్ని నానపెట్టిన నీటిని లేదంటే.. అన్నం ఉడుకుతున్న సమయంలో తీసిన నీటిని అంటే గంజిని కూడా మనం ఉపయోగించొచ్చు. ఈ నీటిలో విటమిన్ బి1, సి, ఈ వంటి ఖనిజాలు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంలో గ్లో తీసుకురావడానికి బాగా హెల్ప్ చేస్తాయి. కొరియన్ వాళ్ల బ్యూటీ సీక్రెట్ ఇదే అని చెప్పొచ్చు.
బియ్యం నీరు రంధ్రాల లోపల నేరుగా వెళ్లి బ్లాక్ హెడ్స్ ని బయటకు పంపదు. కానీ, రెగ్యులర్ గా ఈ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ఈ బ్లాక్ హెడ్స్ తగ్గుముఖం పడతాయి.అంతేకాదు.. వయసు రీత్యా ముఖం సాగిపోయినట్లుగా కనిపించకుండా.. బిగుతుగా ఉంచుతుంది. యవ్వనంగా మారుస్తుంది. బియ్యం నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, స్టార్చ్ ఉంటాయి. ఇవి చర్మాన్ని అందంగా మారుస్తాయి. ముఖ్యంగా స్మూత్ గా మారుస్తుంది. చిన్న పిల్లల స్కిన్ లా కనపడుతుంది. కనీసం నెల రోజులు అయినా ఈ బియ్యం నీటిని ముఖానికి వాడటం వల్ల మీ ముఖంపై బ్లాక్ హెడ్స్ క్రమంగా తగ్గిపోతాయి.
½ కప్పు బియ్యాన్ని కడిగి, 2 కప్పుల నీటిలో 30 నిమిషాలు నానబెట్టండి.ఆ నీటిని వడకట్టి ఫ్రిజ్‌లో 5-7 రోజులు నిల్వ చేసుకోండి.టోనర్‌గా వాడండి లేదా షీట్ మాస్క్‌లలో నానబెట్టి ముఖానికి అప్లై చేయండి.వారానికి ఒకసారి ముల్తానీ మట్టి కలిపి ఫేస్‌ప్యాక్‌లా వాడినా మంచి ఫలితాలు వస్తాయి.
జాగ్రత్తలు..
బియ్యం నీరు సాధారణంగా సురక్షితం. అయినప్పటికీ, సూపర్ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. పులియబెట్టిన నీరు వాడొద్దు. అది చర్మాన్ని తీవ్రంగా రియాక్ట్ చేయించవచ్చు. అలాగే వాడిన తర్వాత చల్లని ప్రదేశంలో ఉంచడం, వారం దాటి వాడకపోవడం ఉత్తమం.
ఫైనల్ గా..
బియ్యం నీరు చర్మానికి మెరుపు, మృదుత్వాన్ని తెచ్చే సహజ మార్గం. ఇది బ్లాక్‌హెడ్స్‌ను తక్షణమే తొలగించదు, కానీ సమస్య మళ్ళీ రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. చర్మ సంరక్షణలో దీన్ని చేర్చడం వల్ల, ముఖ్యంగా ఇది తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండటంతో ఎవరైనా ఈజీగా ప్రయత్నించొచ్చు.