చైనాలో ఓ వీడియో వైరల్ గా మారింది. ఓ చిన్నారి కారులోనుంచి ప్రమాదవశాత్తు రోడ్డు మీద పడింది. కానీ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
చైనాలో ఓ చిన్నారి కారు కిటికీలోంచి బైట పడ్డ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, షాంఘైకి దక్షిణంగా తూర్పు చైనాలోని నింగ్బో నగరంలో ట్రాఫిక్ కూడలిలో ఈ సంఘటన జరిగింది. కారు కదులుతున్న సమయంలో వెనుక సీటు కిటికీలోంచి బయటకు వంగి ఉన్న బాలిక ప్రమాదవశాత్తు కిందపడిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే, అది గమనించిన ఓ వ్యక్తి చిన్నారిని కాపాడడంతో ప్రమాదం తప్పింది. ఆ చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించామని, ఆమెకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్రాఫిక్ జంక్షన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
ఈ వీడియోలో.. ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో కార్లు వరుసగా ఆగాయి. ఓ తెల్లకారులో వెనక సీటులోని చిన్నారి.. కిటికీలో నుంచి తల బైటికి పెట్టి చూస్తోంది. మరి ఎలా జరిగిందో తెలియదు కానీ.. కారు కదిలే సమయానికి పూర్తిగా అందులోనుంచి బైటికి పడింది. అయితే కారు డ్రైవర్ ఈ విషయాన్ని గమనించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. కిందపడ్డ చిన్నారి ఏడుస్తూ అలాగే జీబ్రా క్రాసింగ్ మీద పడి ఉంది. వెనక వస్తున్న కార్లు అది గమనించి ఆగిపోయాయి. ఇంతలో అటుగా వెడుతున్న ఓ వ్యక్తి వచ్చి చిన్నారిని రోడ్డు మీదినుంచి తీసుకుని ఎత్తుకున్నాడు. వెంటనే స్థానిక ఆస్పత్రికి ఆ చిన్నారిని తరలించి, పోలీసులకు సమాచారం అందించారు.
undefined
ఇలాంటి వీడియోనే.. గత నెలలో ఒకటి బ్రెజిల్ లో వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కదులుతున్న బస్సుకిందికి వెళ్లి.. తృటిలో తప్పించుకుని గాయాలతో బయటపడిన షాకింగ్ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో.. ఓ బస్సు, ఓ టూ వీలర్ మీద వెడుతున్న వ్యక్తి.. సమాంతరంగా వెడుతున్నారు. అతను హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. ఇంతలో బైక్ స్కిడ్ అయి.. బైక్ మీదినుంచి ఎగిరి బస్సు కింద పడ్డాడు. ఈ క్రమంలో అతని తలమీదికి టైరు వచ్చే సమయానికి బస్సు ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.
Heights of Careless parents. - Child falls out of window in Ningbo, China. pic.twitter.com/rowxkQL62P
— Siraj Noorani (@sirajnoorani)