సదరు మహిళ పేరు ఏరియల్ ఎగోజీ. కాగా.. ఆమెకు లింక్డిన్ ఫ్లాట్ ఫారమ్ లో 9 వేల మందికి పైగా అనుచరులు కూడా ఉన్నారు. కాగా.. ఆమె ఇటీవల ఓ పోస్టు పెట్టింది. అందులో తాను ఒక సెక్స్ వర్కర్ అంటూ వర్క్ ఎక్స్ పీరియన్స్ గా పేర్కొనడం గమనార్హం.
ఈ రోజుల్లో ఉద్యోగం కోసం ప్రతి ఒక్కరూ లింక్డిన్ అనే సోషల్ నెట్ వర్క్ ని వినియోగిస్తున్నారు. ఈ విషయం మనకు తెలిసిందే. మనం ఉద్యోగం మారాలి అనుకునేటప్పుడు మన ప్రొఫైల్ ని లింక్డిన్ లో పెడుతూ ఉంటాం. తాజాగా ఓ మహిళ కూడా అలానే పెట్టింది. అయితే.. తన వర్క్ ఎక్స్ పీరియన్స్ గా తనొక సెక్స్ వర్కర్ అని పెట్టడం గమనార్హం.
సదరు మహిళ పేరు ఏరియల్ ఎగోజీ. కాగా.. ఆమెకు లింక్డిన్ ఫ్లాట్ ఫారమ్ లో 9 వేల మందికి పైగా అనుచరులు కూడా ఉన్నారు. కాగా.. ఆమె ఇటీవల ఓ పోస్టు పెట్టింది. అందులో తాను ఒక సెక్స్ వర్కర్ అంటూ వర్క్ ఎక్స్ పీరియన్స్ గా పేర్కొనడం గమనార్హం. కాగా.. ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
undefined
ఆమె పోస్టులో ఇలా రాశారు. "నేను రెండు వారాల క్రితం ఫ్యాన్సీ బెనిఫిట్‌లతో అంతర్గత ఉద్యోగాన్ని విడిచిపెట్టాను. నేను అలా చేయడానికి కారణం సెక్స్ వర్క్. ఇంతవరకు నేను చేసిన ఉద్యోగంతో తగినంతగా పొదుపు చేశాను. కానీ నేను సంతోషంగా ఉన్నానా అని అడిగితే మాత్రం నేను లేననే చెప్పాలి. కానీ ఇఫ్పుడు మాత్రం నేను కావాల్సిన దానికంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాను." అని ఆమె పోస్టు పెట్టారు.
ఎగోజీ భావోద్వేగ శ్రమ గురించి మాట్లాడారు. " కొందరు చెల్లించడానికి ఇష్టపడకపోయినా నేను పట్టించుుకోను. ఎందుకంటే నేను ఎలాంటి భావోద్వేగ శ్రమ అవసరమో రుసుములోనే ఛార్జ్ చేస్తాను. నేను సరిహద్దులను సెట్ చేసి ఉంచుతాను. సురక్షితమైన, ఉల్లాసభరితమైన, సమృద్ధిగా ఉండే మార్గాల్లో మాత్రమే పాల్గొంటాను. వీటిలో ఏది తక్కువైనా నేను నా సమయాన్ని వృథా చేసుకోను. బేరాలు ఆడడం ఆపేశాను. నేను నిరూపించుకోవడానికి ఏమీ లేదు. నా విలువను స్పష్టంగా చెప్పేందుకు నేను నా పని చేశాను..’ అంటూ ఆమె తన పోస్టును కొనసాగించారు.
కాగా.. ఆమె పెట్టిన పోస్టును దాదాపు 8వేల మంది లైక్ చేయడం గమనార్హం. ఇక 15వేల మందికిపైగా కామెంట్స్ చేశారు. ఆమె పెట్టిన పోస్టుకు కొందరు పాజిటివ్ గా స్పందించగా... మరికొందరు నెగిటివ్ గా స్పదించడం గమనార్హం.
"మేము అబార్షన్ సందర్భంలో మహిళల హక్కుల గురించి మాట్లాడుతాము కానీ ఆదాయాన్ని సంపాదించడానికి స్త్రీ తన శరీరాన్ని ఉపయోగించుకునే హక్కు గురించి పెద్దగా మాట్లాడటం లేదు. క్రీడాకారులు, సంగీతకారులు, మోడల్‌లు, అక్రోబాట్‌లు, నిర్మాణ కార్మికులు కూడా ఆదాయాన్ని సంపాదించడానికి వారి శరీరాలను ఉపయెగించుకుంటున్నారు. దానిని ఎవరూ తప్పు పట్టడం లేదు. ఒక మహిళ తన ఆదాయాన్ని సంపాదించుకోవడానికి తన శరీరాన్ని ఎంచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు’’ అంటూ మరొకరు కామెంట్ రూపంలో సదరు మహిళకు మద్దతుగా నిలవడం గమనార్హం.
మరో యూసర్ ఆమె తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టారు. "ఇది మీరు ఆడుతున్న చాలా ప్రమాదకరమైన గేమ్. ఖచ్చితంగా మీకు మంచి క్లయింట్లు ఉండవచ్చు కానీ వ్యక్తులు అబద్ధాలు చెప్పవచ్చు. ఏ క్షణంలోనైనా ఒక వ్యక్తి మీకు హాని చేయాలని కోరుకుంటే వారు చేయగలరు. జాగ్రత్త వహించండి మేడమ్. మీరు దీని గురించి మరింత ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను.’’ అంటూ మరో వినియోగదారుడు పేర్కొనడం గమనార్హం.