
టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న భారత అంధ మహిళల క్రికెట్ జట్టు తెలుగు క్రీడాకారిణి కరుణ కుమారి విజయవాడ విమానాశ్రయానికి చేరుకోగా ఘన స్వాగతం లభించింది. కరుణ కుమారి అద్భుత ప్రదర్శనతో జట్టును విజేతలుగా నిలిపారు. తల్లి సంధ్య, తండ్రి రాంబాబు, కోచ్ అజయ్ కుమార్ రెడ్డి సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.