మీరు మరదలు, శిఖండి, కొజ్జా అనొచ్చా... నేను జవాభిస్తే తప్పొచ్చిందా?: వైఎస్ షర్మిల

Feb 20, 2023, 3:50 PM IST

హైదరాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రను మహబూబాబాద్ లో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా షర్మిల వ్యవహరిస్తున్నారంటూ పాదయాత్రకు పోలీసులు అనుమతి తిరస్కరించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ లో పాదయాత్ర క్యాంప్ లో షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరబాద్ కు తరలించారు. ఈ క్రమంలో తన పాదయాత్రను అడ్డుకోవడంపై షర్మిల స్పందిస్తూ బిఆర్ఎస్ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మహిళ అని కూడా చూడకుండా మంత్రులు, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు షర్మిల అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకేమో వ్రతాలంటాడు, ఇంకోడేమో మరదలు అంటాడు, ఇంకొకామె శిఖండి అంటుంది, మరొకరు కొజ్జా అంటాడని...అడుగు బయటపెడితే నల్లిని నలిపేసినట్లు నలిపేస్తామని ఒకడు, కార్యకర్తలకు ఒక్క సైగచేస్తే దాడి చేస్తారని ఇంకొకరు బెదిరిస్తారని అన్నారు. మీరు ఎన్ని మాట్లాడినా చెల్లుతదా.. మేం బధులిస్తే మాత్రం తప్పా అంటూ ప్రశ్నించారు. తనకు జరిగిన అవమానం మహిళా లోకానికి జరిగినట్లని... కాబట్టి మహిళలంతా ఒక్కటై కేసీఆర్ తో పాటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బుద్ది చెప్పాలని షర్మిల కోరారు.