Mar 8, 2023, 5:03 PM IST
హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున వైఎస్ షర్మిల నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. వైఎస్సార్ తెలగాణ పార్టీ అధ్యక్షురాలితో పాటు మహిళా నాయకులు, కార్యకర్తలు భారీఎత్తున హుస్సెన్ సాగర్ తీరంలోగల ట్యాంక్ బండ్ పై మౌన దీక్ష చేపట్టారు. ఇలా రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద నోటికి నల్లటి గుడ్డు కట్టుకుని మౌనదీక్షకు కూర్చును షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసారు. షర్మిల మౌనదీక్షను భగ్నం చేసిన పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత షర్మిలను లోటస్ పాండ్ లోని నివాసం వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయారు.