Jan 24, 2022, 5:42 PM IST
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తున్న ఇసుక లోడ్ తో వెలుతున్న ట్రాక్టర్ ను హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎల్ఎండి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు . గాయపడ్డ వారు కరీంనగర్ వాసులుగా తెలుస్తోంది. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమైంది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. కారు వేగంగా ఢీ కొట్టడంతో ముందు బాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనపై ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు.