Mar 13, 2023, 3:26 PM IST
కరీంనగర్ :ఒకరి నిర్లక్ష్యపు డ్రైవింగ్, మరొకరి అతివేగం రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. నిన్న(ఆదివారం) కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బైకర్లు మృతిచెందారు. ఈ ఘోర ప్రమాదం సిసి కెమెరాల్లో రికార్డయ్యింది. అతివేగంతో దూసుకొచ్చిన బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో బైక్ పైకి దూసుకెళ్ళింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు.