Mar 17, 2023, 5:38 PM IST
TSPSC పేపర్ లీక్ తో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కిపడింది. ఎందరో నిరుద్యోగులు తమ విలువైన కాలాన్ని వెచ్చించి ఉద్యోగం సంపాదించడానికి నిద్రాహారాలు మాని చదువుతుంటారు. ఈ పేపర్ లీక్ తో వారి జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. TSPSC లో ఈ కుంభకోణాల పై విచారణ జరిపించడమే కాకుండా, దీనికి బాధ్యుణ్ణి చేస్తూ కేటీఆర్ ని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని దరువు ఎల్లన్న డిమాండ్ చేసాడు. ఉస్మానియా యూనివర్సిటీ NCC గేట్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తూ... అవినీతికి పాల్పడ్డాడని తాటికొండ రాజయ్యను ఉపముఖ్యమంత్రి పదవి నుండి తప్పించినప్పుడు, ఈటెలను పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పుడు... ఐటీ శాఖా నిర్లక్ష్యం వల్ల జరిగిన దీనికి కేటీఆర్ ని బాధ్యుణ్ణి చేస్తూ కేసీఆర్ తన కొడుకుని మంత్రివర్గం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసాడు.