డిసెంబర్ 9 లాగే మార్చి 9 కూడా... చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు .: ఉద్యోగ భర్తీ ప్రకటనపై కవిత

Mar 9, 2022, 2:27 PM IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో భర్తీచేయనున్న 95శాతం ఉద్యోగాలు మన బిడ్డలకే దక్కేలా కేసీఆర్ చేసారని అన్నారు. తెలంగాణ ప్రకటన వెలువడిన డిసెంబర్ 9వ లాగే నిరుద్యోగుల కోసం సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటనలు చేసినన మార్చి 9 కూడా చరిత్రలో నిలిచిపోతుందని కవిత అన్నారు.