Mar 8, 2023, 10:08 AM IST
కరీంనగర్ :అప్పటివరకు హోలీ వేడుకల్లో భాగంగా రంగుల్లో మునిగితేలారు ఆ ముగ్గురు స్నేహితులు. ఎంతో సరదాగా హోలీ వేడుకలు జరుపుకుని స్నానాలకు మానేరు రివర్ ప్రంట్ లో దిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది.
ఒంగోలు జిల్లా చీమకుర్తి ప్రాంతానికి చెందిన వలసకూలీలు కరీంనగర్ లో నివాసముంటున్నారు.వీరి బిడ్డలు వీరాంజనేయులు(16), సంతోష్(13), అనిల్(14) హోలీ వేడుకల్లో పాల్గొని అలుగునూరు వద్ద మానేరు రివర్ ప్రంట్ లో స్నానాలకు దిగారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా వుండటంతో ముగ్గురు యువకలు నీటమునిగి మృతిచెందారు. దీంతో వీరి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.3లక్షలు, మంత్రి గంగుల రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మంత్రి గంగుల చేతులమీదుగా రేపు(గురువారం) బాధితులకు చెక్కులు అందించనున్నారు.