Feb 24, 2023, 10:41 AM IST
జగిత్యాల జిల్లా : కొండగట్టు పుణ్యక్షేత్రం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. ఆలయ సిబ్బంది ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలోని సిసి ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. మూసివేసిన ఆలయం భక్తులకు అనుమతి లేదు. ఆలయంలోని నగలు భారీగానే మాయం అయ్యాయని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొండగట్టు దేవస్థానంలో స్వామివారి మకటతోరణం, శటారి దొంగలు ఎత్తుకెళ్లారు. మల్యాల మండలం ముత్యంపేట గ్రామం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో విగ్రహాలను దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగతనం నేపథ్యంలో దేవస్థాన అధికారులు ఆలయాన్ని మూసివేశారు.