కల్నల్ సంతోష్ బాబు ఇంటికి సీఎం కేసీఆర్..

Jun 22, 2020, 2:28 PM IST

భారత్ చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు ఇంటికి ఈ రోజు సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ రానుండడంతో ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టారు. సూర్యాపేటలోని సంతోష్ బాబు ఇంటి చుట్టు పక్కలా భారీగా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది మోహరించారు. ముందుగా జగదీష్ రెడ్డి అక్కడికి చేరుకుని భద్రతా చర్యలను పరిశీలించారు.